రెడ్ అంబులెన్స్ సంస్థ దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తూ గ్రేటర్ హైదరాబాద్ అంబులెన్స్ ఓనర్స్ అసోసియేషన్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఎర్రమంజిల్ కాలనీలో వందల మంది అంబులెన్స్ యాజమానులు, డ్రైవర్లు ఆ సంస్థకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. ట్రస్టు పేరుతో నగరంలోకి ప్రవేశించి.. ప్రస్తుతం బడా వ్యాపారం చేస్తోందని ఆరోపించారు.
నగరంలోని ముఖ్య ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకుని సాధారణ అంబులెన్స్‌లను లోనికి రాకుండా అడ్డుకుంటున్నారని అంబులెన్స్ యాజమాని నాగన్న అవేదన వ్యక్తం చేశారు. ఆ సంస్థ 30శాతం కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తోందని ఆరోపించారు. రెడ్ ఆంబులెన్స్ దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేయకపోతే తమ కుటుంబాలతో సహా ఆత్మహత్య చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని సురేష్ అన్నారు. ప్రభుత్వం తక్షణమే ఈ విషయంపై దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలన్నారు. దోపిడీకి గురవుతోన్న రోగులను, అంబులెన్స్ నిర్వాహకులను రక్షించాలని కోరారు.
ఇదీ చూడండి: రైల్వే క్రాసింగ్ గేట్ల స్థానంలో వంతెనల నిర్మాణం వేగవంతం