ETV Bharat / city

Amaravati farmers padayatra: అశేష జనసందోహం మధ్య... తిరుపతి చేరుకున్న మహాపాదయాత్ర - రైతుల పాదయాత్ర

Amaravati farmers padayatra:వయోభారం వారి సంకల్పానికి అడ్డుకాలేదు. అనారోగ్య సమస్యలు వారి మనోధైర్యం ముందు తలవంచాయి. అడ్డంకులు, ఆంక్షలు, వేధింపుల్ని.. మౌనంగా భరించారు. అమరావతే ఊపిరి అంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగారు. ఒకటి కాదు రెండు కాదు.... 400కు పైగా కిలోమీటర్లు అలుపు లేకుండా నడిచారు. 45రోజుల పాటు చేపట్టిన సుదీర్ఘ మహాపాదయాత్ర అందరి ఆకాంక్ష అమరావతేనని చాటుతూ లక్ష్యానికి చేరువైంది. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరిట నవంబర్ 1న ఏపీ రాజధాని రైతులు చేపట్టిన కాలినడక నేడు అలిపిరి వద్ద ముగియనుంది.

Amaravati farmers padayatra
Amaravati farmers padayatra
author img

By

Published : Dec 14, 2021, 9:09 AM IST

Amaravati padayatra:ఎన్ని మైళ్ల ప్రయాణమైనా తొలి అడుగుతోనే ప్రారంభమవుతుంది. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని నినాదంతో ఏపీలోని అమరావతి రైతులు... తుళ్లూరులో చేపట్టిన మహాపాదయాత్ర కొండలు, గుట్టలు, వాగులు వంకలు దాటుకుని ఎండనక, వాననక సాగి తిరుపతి చేరింది. నిన్న తిరునగరిలో అన్నదాతలు మోగించిన అమరావతి నినాదానికి పుర ప్రజలు పెద్దఎత్తున తరలి వచ్చి మద్దతు పలికారు. రహదారి వెంబడి నిలబడి సంఘీభావం తెలుపుతూ ఘనస్వాగతం పలికారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల వారు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జై అమరావతి అంటూ నినదించారు.
అశేష జనసందోహం మధ్య...

రైతుల 43వ రోజు మహాపాదయాత్ర రేణిగుంట నుంచి తిరుపతి నగరం మీదుగా తనపల్లి క్రాస్‌రోడ్డు వద్ద ఉన్న రామానాయుడు కల్యాణ మండపం వరకు కొనసాగింది. జనసందోహంతో ప్రధాన రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. వైకాపా మినహా మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రైతులకు నీరాజనాలు పలికారు. రేణిగుంట వద్ద మాజీ మంత్రి కొల్లు రవీంద్రతో పాటు మాజీ ఎంపీ కొనకళ్ల సత్యనారాయణ రైతులకు సంఘీభావం తెలిపారు. మచిలీపట్నం నియోజకవర్గం తరఫున 12 లక్షల 69 వేల 999 రూపాయలను పాదయాత్రకు విరాళం అందించారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ రైతులతో కలిసి నడిచారు.

రెపరెపలాడిన అమరావతి జెండాలు...
తిరుపతి నగరంలోకి ప్రవేశిస్తున్న సమయంలో తెలుగుదేశం నేతలతోపాటు స్థానికులు... రైతులకు, మహిళలకు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. మహిళా రైతులందరికీ పూలహారం వేసి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ సత్కరించారు. తిరుపతి నగర శివార్లలోకి పాదయాత్ర చేరుకునే సరికి స్థానికులు, రైతులతో దారి పొడువునా పాదయాత్రలో అమరావతి జెండాలు రెపరెపలాడాయి.

ఒకవైపు వర్షపు జల్లు... మరోవైపు పూల జల్లు...

ఒకవైపు వర్షపు జల్లు... మరోవైపు పూల జల్లులతో రైతులు, మహిళలు తడిసి ముద్దయిపోయారు. పాదయాత్రకు మద్దతుగా తెలుగుదేశం నేత పులివర్తి నాని ఆధ్వర్యంలో చంద్రగిరి నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బెలూన్లతో వారికి స్వాగతం పలికి మీ వెంటే మేం ఉన్నామంటూ నినాదాలు చేశారు.

అలిపిరి వద్ద ముగియనున్న పాదయాత్ర...

ఇవాళ రైతులు తిరుపతి నగరంలో పాదయాత్ర నిర్వహించనున్నారు. సాయంత్రం అలిపిరి వద్దకు చేరుకుని కొబ్బరికాయలు కొట్టడంతో మహాపాదయాత్రను ముగించనున్నారు. బుధవారం స్వామివారి దర్శనాలు చేసుకోనున్న రైతులు...... 17వ తేదీన అమరావతి ఆకాంక్షను చాటేలా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.

తిరుపతి చేరుకున్న మహాపాదయాత్ర

ఇదీ చదవండి: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జీవిత కథతో వెబ్ సిరీస్..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.