ETV Bharat / city

Amaravati farmers donate: వరద బాధిత జిల్లాలకు అమరావతి రైతుల విరాళం

author img

By

Published : Nov 23, 2021, 1:58 PM IST

AP Floods news: వరద బాధిత జిల్లాలకు అమరావతి రైతుల విరాళం అందించారు. మహాపాదయాత్రకు వచ్చిన చందాల నుంచి 15 లక్షల రూపాయల విరాళాన్ని ఇచ్చారు.

Amaravati farmers donate, AP Floods news
వరద బాధిత జిల్లాలకు అమరావతి రైతుల విరాళం

Amaravati farmers donate: వరద బాధిత జిల్లాలకు అమరావతి రైతుల విరాళం అందించారు. మహాపాదయాత్రకు వచ్చిన చందాల నుంచి 15 లక్షల రూపాయల విరాళాన్ని ఇచ్చారు. చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలకు 5 లక్షల చొప్పున నగదును మూడు జిల్లాల కలెక్టర్లకు విరాళంగా అందజేయాలని రైతుల నిర్ణయించారు. రైతుల బాధ రైతులకే తెలుసంటూ రాజధాని రైతులు ఈ విరాళం ప్రకటించారు.

ఏపీ సీఎం జగన్ సమీక్ష

AP CM JAGAN ON RAINS: భారీ వర్షాలపై చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల కలెక్టర్లతో ఏపీ సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తిరుపతిలో వరదనీటి నిల్వకు కారణాలపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. బాధితులను ఆదుకోవడంలో ఉదారంగా ఉండాలన్న జగన్... ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి రూ.2వేలు చొప్పున ఇవ్వాలని సూచించారు. వర్షాల వల్ల వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. చెరువులకు గండ్లు పడినచోట తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సహాయ చర్యల కోసం ఆయా జిల్లాలకు అదనంగా నిధులు మంజూరు చేయాలని శుక్రవారం జరిగిన కాన్ఫరెన్స్​లో ఆ రాష్ట్ర సీఎం స్పష్టం చేశారు.

వానలతో అతలాకుతలం

Andhra pradesh flood news: ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో వర్షం ఆగి రెండు రోజులు గడిచినా చాలా గ్రామాలు ముంపులోనే ఉన్నాయి. రహదారులు కోతకు గురై చాలాగ్రామాలకు రాకపోకలు నిలిచాయి. జిల్లాలో సుమారు 30 వేలమందిపై వరద ప్రభావం చూపింది. రాయలచెరువుకు చిన్న గండి పడడంతో రామచంద్రాపురం, తిరుపతి గ్రామీణ మండలాల పరిధిలోని 16 గ్రామాల్లో14 వేల 960 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు చేర్చారు. వరద బాధితులు కట్టుబట్టలతో వచ్చినాపశువుల్ని వదిలేసి రావడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాయలచెరువుకు గండి పడిన ప్రాంతాన్ని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించి తాజా పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. గండి పూడ్చేందుకు ఐఐటీ నిపుణుల సలహా తీసుకుంటున్నామని, వీలైనంత త్వరగా పూడ్చే ప్రయత్నం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

నెల్లూరు జిల్లాలో...

నెల్లూరులో వరద(ministers review on Ap Floods) పీడిత ప్రాంతాలను ఆ రాష్ట్ర మంత్రులు బాలినేని శ్రీనివాసులరెడ్డి, అనిల్ కుమార్ పరిశీలించారు. సహాయక చర్యలు సహా... విద్యుత్ సరఫరా పునరుద్ధణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. నెల్లూరు జిల్లా సోమశిల జలాశయం దగ్గర ప్రవాహంతో నేలమట్టమైన శివాలయాన్నితెలుగు రాష్ట్రాల దేవాలయాల పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు కమలానంద భారతి పరిశీలించారు.

కడప జిల్లాలో...

AP Floods news: కడప జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న అద్దాలమర్రి బ్రిడ్జిని కాంగ్రెస్ నేతతులసిరెడ్డి సందర్శించారు. అతివృష్టికి.. ప్రభుత్వ నిర్లక్ష్యంతోడై.. భారీ నష్టానికి కారణమైందని విమర్శించారు.

ఇదీ చదవండి: Minister perni nani: వరదల వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటాం: పేర్నినాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.