ఏపీలోని ప్రకాశం జిల్లాలో తొమ్మిదో రోజు సాగుతున్న మహాపాదయాత్రకు(amaravathi farmers maha padayatra in prakasam district) ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. అన్నదాతలకు హారతులు ఇచ్చి, కొబ్బరి కాయలు కొట్టి, గుమ్మడి కాయలతో దిష్టి తీసి సాదర స్వాగతం(Welcome) పలికారు. ప్రకాశం జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన వేలాది మంది రాజధాని రైతులకు పూర్తి సంఘీభావం ప్రకటించారు. 5 కోట్ల ఆంధ్రుల భవిత కోసం వెల కట్టలేని భూమిని త్యాగం చేసిన అన్నదాతల(Farmers)కు అన్నివర్గాల ప్రజలు అండగా నిలిచారు. వివిధ సంఘాలు, రాజకీయ పార్టీలు, నేతలు రైతులకు మద్దతుగా నిలిచారు. 80 ఏళ్లు దాటిన వృద్ధులు సైతం అమరావతి సాధనే ధ్యేయమంటూ యువతలో స్ఫూర్తి నింపారు. అన్నదాతలు, మహిళలతో కలిసి అన్నివర్గాల ప్రజలు పాదం కలిపిన వేళ మహాపాదయాత్ర మహా ప్రభంజనాన్ని తలపించింది. రైతుల్లోని ఉద్యమ స్ఫూర్తికి మరింత ఊతమిచ్చింది.
అమరావతితోనే భవిష్యత్తు...
ఇవాళ 15 వ రోజు యాత్రలో భాగంగా రైతులు ఎం.నిడమానూరు నుంచి కందుకూరు మండలం విక్కిరాలపేట వరకు 14కిలో మీటర్ల మేర నడక సాగించారు. ప్రతి చోట స్థానికులు మేము మీ వెంటే అంటూ అండగా నిలిచారని రాజధాని రైతులు(amaravathi farmers maha padayatra) హర్షం వ్యక్తం చేశారు. అసత్య ప్రచారాలు చేస్తున్న వైకాపా నేతలకు తగిన బుద్ధి చెబుతామని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించినా ఎన్ని అవరోధాలు సృష్టించినా ఏకైక రాజధానిగా అమరావతిని సాధించుకుంటామని స్పష్టం చేశారు. ముస్లిం, మైనార్టీ సంఘాల నేతలు... రైతుల న్యాయమైన పోరాటం విజయం సాధించాలని అభిలాషించారు. అన్నదాతలతో కలిసి యువత, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు అమరావతితోనే(amaravathi) భవిష్యత్తు అని స్పష్టం చేశారు. మహాపాదయాత్రకు ప్రకాశం జిల్లాలో వస్తున్న స్పందన ఓర్వలేకనే మంత్రులు అవాస్తవాలు మాట్లాడుతున్నారని నేతలు మండిపడ్డారు. ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకుంటే పాదయాత్ర(maha padayatra) మహోద్యమంలా మారుతుందని హెచ్చరించారు.
'మీ రాజధానిని మీరే కాపాడుకోవాలి'
పండుగ వాతావరణంలో మహోద్యమంలా సాగుతున్న యాత్రలో యువత ముఖ్య భూమిక పోషించాలని అన్నదాతలు పిలుపునిచ్చారు. మీ రాజధానిని మీరే కాపాడుకోవాలని సూచించారు. ప్రతికూల వాతావరణం ఆటంకం కలిగించినా, పాలకులు అడ్డంకులు సృష్టించినా పట్టువదలని సంకల్పంతో ముందుకు సాగుతున్న అమరావతి రైతులు(amaravathi farmers)... 5 కోట్ల ఆంధ్రుల ఏకైక రాజధానిని సాధించి తీరుతామని స్పష్టం చేశారు.
ఇవీచదవండి.