విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా రంగంపేటలో ప్రముఖ సైకత శిల్పి దేవిన శ్రీనివాస్ తన కుమార్తెలు సోహిత, ధన్యతలతో కలిసి రూపొందించిన సైకత శిల్పం ఆకట్టుకుంటుంది. 'వీరుడా.. అందుకో మా జోహార్లు' అన్న నినాదంతో భుజాన విల్లు ధరించి వీరత్వం, పౌరుషం నిండిన అల్లూరి రూపంతో పాటు.. ఆయన వెనుక స్వేచ్ఛగా ఎగురుతున్న జాతీయ పతాకాన్ని తీర్చిదిద్దారు. సుమారు 12 గంటలు శ్రమించి సైకత శిల్పం రూపొందించి అల్లూరికి ఘన నివాళులు అర్పించారు.
ఇవీ చూడండి..
BJP IN TELANGANA: 'తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ తీసుకురావడమే లక్ష్యం'
కెమిస్ట్ హత్య.. స్నేహితులదే కుట్ర.. ఆ ఎన్జీఓ కేంద్రంగానే అంతా.. దర్యాప్తు వేగవంతం!