రాష్ట్రంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయని అఖిలపక్షం నేతలు ఆరోపించారు. గాంధీ ఆస్పత్రిని సందర్శించి విషజ్వరాలు, డెంగ్యూతో బాధపడుతున్న రోగులను పరామర్శించారు. వార్డులు కలియ తిరుగుతూ వైద్యసౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా గాంధీ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది, బెడ్ల కొరత ఎక్కువగా ఉందని తెదేపా నేత రమణ అన్నారు. ఈనెల 19న ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు కల్పించాలని కోరుతూ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ ముందు అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. చికున్ గున్యా, స్వైన్ ప్లూ ప్రతినెల పదిహేనుకు పైగా నమోదవుతున్నాయని తెజస అధ్యక్షుడు కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రగతిభవన్లో కుక్క మరణిస్తే సీఎం చూపించిన చొరవ.. ప్రజలపై చూపడం లేదని తెదేపా సీనియర్ నాయకుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు.
గాంధీ ఆస్పత్రిని సందర్శించిన "అఖిలపక్షం" నేతలు - FEVERS
ప్రజలు పెద్ద ఎత్తున విష జ్వరాలబారిన పడుతున్నా.. ప్రభుత్వం మాత్రం మాటలకే పరిమితమవుతోందని అఖిలపక్షం నేతలు విమర్శించారు. హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిని సందర్శించి వైద్యసౌకర్యాలు అందటంపై రోగులను అడిగి తెలుసుకున్నారు.