ETV Bharat / city

Sharmila: పార్టీ ప్రకటనకు సర్వం సిద్ధం.. షర్మిల షెడ్యూల్​ ఇదే.. - వైఎస్​ షర్మిల పార్టీ

వైఎస్సార్​ జయంతి సందర్భంగా వైఎస్​ షర్మిల పార్టీని ప్రకటించనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. షర్మిల షెడ్యూల్​ సైతం ఖారారైంది. వైఎస్సార్​ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి అనంతరం హైదరాబాద్​కు చేరుకుని​ పార్టీని ప్రకటించనున్నారు.

all set for ysr telangana party announcement and ys sharmila schedule

author img

By

Published : Jul 7, 2021, 8:18 PM IST

గురువారం దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్ షర్మిల... తమ పార్టీని ప్రకటించనున్నారు. ఫిల్మ్​నగర్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ ఆవిర్భావ సభకు సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే... పార్టీ జెండాలతో కన్వెన్షన్​ను అలంకరించారు. ఈ సందర్బంగా అడహక్ కమిటీ సభ్యులు పార్టీ ఏర్పాట్లను పరిశీలించారు. పార్టీ ఆవిర్భావ కార్యక్రమాలను ప్రత్యక్షంగా చూసేవారితో పాటు పరోక్షంగా పార్టీ ప్రారంభోత్సవాన్ని తిలకించేందుకు సైతం ఏర్పాట్లు చేశామని వైఎస్సాఆర్​ తెలంగాణ పార్టీ అడహక్ కమిటీ సభ్యుడు కొండా రాఘవరెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి: sharmila: ఇడుపులపాయకు షర్మిల.. వైఎస్​ఆర్​కు నివాళులు

షర్మిల పర్యటన ఇలా...

"జూమ్ ఆప్ ద్వారా లక్షలాది మంది ఈ కార్యక్రమాన్ని చూసేవిధంగా ఏర్పాట్లు చేశాం. రేపు ఉదయం వై.ఎస్.షర్మిల ఇడుపులపాయకు చేరుకుంటారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేసి.. కడప నుంచి ప్రత్యేక చాపర్​లో మధ్యాహ్నం ఒంటిగంట వరకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. బేగంపేట విమానాశ్రయంలో తెలంగాణ బోనాలు, డప్పులు, కళాబృందాలతో వైఎస్.షర్మిలకు స్వాగతం పలుకుతాం. మధ్యాహ్నం 3 గంటలకు పంజాగుట్ట చౌరస్తాలో వైఎస్సాఆర్ విగ్రహానికి షర్మిల పూలమాలవేసి నివాళులు అర్పిస్తారు. అక్కడి నుంచి నేరుగా జేఆర్సీ కన్వెన్షన్​కు చేరుకుంటారు."

- కొండా రాఘవరెడ్డి, వైఎస్సార్​ తెలంగాణ పార్టీ అడహక్​ కమిటీ సభ్యుడు

పార్టీ ప్రారంభోత్సవానికి అన్ని పార్టీల అధ్యక్షులను, కుల సంఘాలను, మేధావులను, ఏ పార్టీతో సంబంధం లేకుండా న్యూట్రల్​గా ఉన్నవారిని సైతం ఆహ్వానించామని రాఘవరెడ్డి తెలిపారు. సాయంత్రం 5 గంటలకు వైఎస్ షర్మిల.. కొత్త పార్టీ ప్రకటన చేయనున్నట్లు వైఎస్ తెలంగాణ పార్టీ అడహక్ కమిటీ సభ్యులు వెల్లడించారు.

ఇదీ చూడండి: Sharmila: సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న షర్మిల పార్టీ జెండా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.