ETV Bharat / city

ఎంపీ గోరంట్ల వ్యవహారాన్ని గవర్నర్​ దృష్టికి తీసుకెళ్లిన మహిళా నేతలు - గవర్నర్​

All party women leaders meet Governor హిందూపురం ఎంపీ గోరంట్ల వీడియో వ్యవహారంపై అఖిలపక్షాల మహిళా నేతలు వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటివరకు అనేక రూపాల్లో ఆందోళనలు చేసిన మహిళా నేతలు ఈరోజు గవర్నర్​ను కలిసి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించాలని కోరారు. త్వరలోనే దిల్లీ వెళ్లి రాష్ట్రపతి, లోక్​సభ స్పీకర్​ను కలుస్తామని స్పష్టం చేశారు.

All party women
All party women
author img

By

Published : Aug 13, 2022, 6:20 AM IST

Updated : Aug 13, 2022, 6:33 AM IST

All party women leaders meet Governor: ఆంధ్రప్రదేశ్​లోని హిందూపురం నియోజకవర్గం ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంతో పాటు మూడేళ్లుగా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై అఖిలపక్షాల మహిళా ఐకాస నేతలు గవర్నర్​ బిశ్వభూషణ్​ హరిచందన్​కు నివేదిక ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం రాజ్​భవన్​లో గవర్నర్​ను కలిసిన అఖిలపక్షాల మహిళా ఐకాస నేతలు.. నిబంధనలు అతిక్రమించి ప్రవర్తించిన ప్రజా ప్రతినిధులపై చర్యలు ఉండకపోవటంతో పాటు అధికారులు, మంత్రులు తప్పు చేసిన వారిని వెనకేసుకొస్తున్న తీరును వివరించామన్నారు. కేంద్ర ఫోరెన్సిక్​కి ఎంపీ వీడియో వ్యవహారం అప్పగించాలని కోరామన్నారు. ప్రజా ప్రతినిధులు మహిళల పట్ల ఎలా ఉండాలనే దానిపై శిక్షణ తరగతులు ఉండాలని సూచించామన్నారు. ఎంపీకి సంబంధించి నగ్న వీడియో ఉందా అని ఆశ్చర్యపోయిన గవర్నర్ మా ముందే కార్యదర్శిని వివరాలు అడిగి తెలుసుకున్నారన్నారు.

విశాఖ డీఎస్పీగా పని చేసిన ఫకీరప్ప శాటిలైట్ కమ్యూనికేషన్ విభాగంలో నైపుణ్యం సంపాదించారని.. అలాంటి అధికారి తప్పు చేసిన ఓ ఎంపీని వెనకేసుకుని వస్తున్న తీరు బాధాకరమన్నారు. త్వరలోనే దిల్లీ వెళ్లి రాజ్యాంగ పెద్దలను కలుస్తామని స్పష్టం చేసారు. రాష్ట్రంలో మహిళల్ని కాపాడాల్సిన బాధ్యత గవర్నర్​కు ఉందని కోరామని పేర్కొన్నారు. మహిళా హోం మంత్రి సాటి మహిళల్ని కించపరిచే విధంగా వ్యవహరించటం సిగ్గుచేటని నేతలు మండిపడ్డారు. అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్న వైకాపా నేతల తీరును ఉపేక్షించమని హెచ్చరించారు. 3ఏళ్లలో మహిళలపై 777ఘటనలు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. మాధవ్ వ్యవహారంపై కేంద్ర మహిళా కమిషన్ స్పందించినా.. రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేకపోవటం దుర్మార్గమన్నారు. తక్షణమే గోరంట్ల మాధవ్​ను బర్తరఫ్ చేసి స్వతంత్ర వ్యవస్థతో దర్యాప్తు చేయించాలని నేతలు డిమాండ్ చేసారు. మాధవ్​పై చర్యలు తీసుకునే వరకు పార్టీలకతీతంగా కలసికట్టుగా పోరాడతామని వెల్లడించారు.

ఎంపీ గోరంట్ల వ్యవహారాన్ని గవర్నర్​ దృష్టికి తీసుకెళ్లిన మహిళా నేతలు

ఇవీ చదవండి:

Last Updated : Aug 13, 2022, 6:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.