ఆర్టీసీ సమ్మెపై జోక్యం చేసుకోవాలని అఖిలపక్ష పార్టీల నేతలు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌ను కలిశారు. రాజ్‌భవన్‌కు వెళ్లిన అఖిలపక్షం నేతలు కోదండరాం, మల్లు భట్టి విక్రమార్క, వి.హన్మంతరావు, ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి, తమ్మినేని వీరభద్రం, చాడ వెంకట్ రెడ్డి, మోహన్ రెడ్డి, చెరుకు సుధాకర్ ప్రజా రవాణా వ్యవస్థను కాపాడాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలు పట్టించుకోకుండా మొండి వైఖరి అవలంభిస్తోందని తెజస అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ఆర్టీసీ సమ్మెపై మొక్కుబడిగా మాత్రమే చర్చలు జరిపినట్లు గవర్నర్‌కు వివరించినట్లు ఆయన తెలిపారు. వినతుల పట్ల గవర్నర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమస్యపై దృష్టి సారిస్తామని గవర్నర్ తెలిపినట్లు కోదండరాం వెల్లడించారు. ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నారు.
ఆర్టీసీ కార్మికుల మృతి పట్ల గవర్నర్ ఆవేదన వ్యక్తం చేసినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తెలిపారు. ప్రస్తుతం ఇది మరో తెలంగాణ ఉద్యమంలా ఉందని ఆయన అన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను, ప్రజాసంఘాలు, పార్టీల మద్దతును గవర్నర్‌కు తెలిపినట్లు సీఎల్పీనేత మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
గత 27 రోజులుగా కార్మికులు న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా సమ్మెపై చేస్తున్నా ప్రభుత్వం పట్టింపు లేనట్లుగా వ్యవహరిస్తోందని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. పక్క రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే ప్రభుత్వం కమిటీ వేసి పరిష్కరించారనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు.