లాక్ డౌన్ పొడిగింపు కారణంగా రాష్ట్రంలో జరగాల్సిన ఎంసెట్ సహా ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. మే నెలలో జరగాల్సిన ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. మే 2 నుంచి 31 మధ్య ఎంసెట్, ఈసెట్, లా సెట్, పీజీ ఎల్ సెట్, ఐసెట్, ఎడ్ సెట్, పీజీ ఈసెట్, పీఈ సెట్ జరగాల్సి ఉంది.
ప్రభుత్వంతో సంప్రదించి కొత్త తేదీలను తర్వాత వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఈ ప్రవేశ పరీక్షలకు ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసేందుకు గడువు మే నెల 5 వరకు పొడిగించినట్టు తెలిపారు.