ఏపీలోని విశాఖలో అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఏరినాలో ఆరో అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీ.హెచ్. విద్యాసాగరరావు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై... జ్యోతి ప్రజ్వలన చేశారు.
సినీ నటుడు మురళీ మోహన్‌కు అక్కినేని జీవిత సాఫల్య పురస్కారం దక్కింది. శోభ నాయుడుకు రంగస్థలరత్న పురస్కారం, ముళ్ళపూడి వెంకటరత్నానికి వైద్య రత్న, కొనకలూరి ఈనాక్‌కు సాహిత్య రంగ అవార్డులు ప్రదానం చేశారు. 'మహానటి' చిత్రానికి, సేవా రంగంలో 'స్వచ్ఛ చల్లపల్లి' గ్రామానికి చెందిన మనం ట్రస్ట్‌కు, వ్యాపార రంగంలో సురపునేని విజయకుమార్‌కు, కార్టూనిస్ట్ శంకర నారాయణ, ఇంద్రజాల కళాకారుడు క్రాంతికుమార్‌లకు పురస్కారాలు లభించాయి.
అక్కినేని అవార్డులు తమకు దక్కడంపై గ్రహీతలు ఆనందం వ్యక్తం చేశారు. తెలుగు వారికి గుర్తింపు తెచ్చిన వ్యక్తుల్లో అక్కినేని ఒకరంటూ విద్యాసాగర్‌రావు అభిప్రాయపడ్డారు. తెలుగు భాష కోసం ఆలోచించకపోతే అంతరించిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. యూనెస్కో సైతం మాతృభాష దినోత్సవాన్ని జరుపుకోవాలని సూచిస్తోందన్నారు. మాతృ భాషలోనే విద్య బోధన ఉండాలని శాస్త్ర వేత్తలు చెప్తున్నారన్నారు. ఈ వేడుకలో అక్కినేని పట్ల అభిమానం ఉన్న ఒక వైద్యుడు అక్కినేని గీతాలకు నృత్యాలు చేసి అలరించారు.
ఇవీచూడండి: నేడు రాజ్‌భవన్‌లో రాష్ట్రపతికి విందు