ETV Bharat / city

పదకొండు రోజుల్లో ఎలా సాధ్యమైంది? - undefined

ఇంటర్​ వివాదంపై అఖిలపక్షం సమావేశమైంది. కేవలం 11 రోజుల కాలంలోనే 9.25 లక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. సమస్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం
author img

By

Published : May 21, 2019, 6:40 PM IST

Updated : May 21, 2019, 11:34 PM IST

సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం

హైదరాబాద్ హిమాయత్​నగర్​లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. 9.25 లక్షల ఇంటర్ జవాబు పత్రాలను కేవలం 11 రోజుల్లోనే మూల్యాంకనం చేశారని... అంత తక్కువ కాలంలో ఇది ఎలా సాధ్యమైందని అఖిల పక్ష నాయకులు ప్రశ్నించారు. 3.25 లక్షల పేపర్ల మూల్యాంకనానికి ఎక్కువ సమయం ఎందుకు తీసుకుంటున్నారన్నారు. ఒక్క రోజులో ఒక్కొక్కరు 110 పేపర్లు దిద్దినట్టు తమకు సమాచారం ఉందన్నారు. ఫలితాల విషయంలో గ్లోబారీనా సంస్థ ఇంటర్ బోర్డును తొందర పెట్టిందన్నారు. మొదటిసారి దిద్దినప్పటి మార్కుల జాబితా, పునః మూల్యాంకనం తర్వాత మార్కుల జాబితాను బహిర్గతపరచాలని కోరారు. ఇంటర్మీడియట్ వ్యవహారంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మళ్ళీ వాయిదా పడటం వల్ల విద్యార్థులు నష్టపోతారని పేర్కొన్నారు. ఎన్ని నిరసనలు చేసినా ప్రభుత్వం కనీసం స్పందించడం లేదన్నారు. ఇప్పటికైనా బాధ్యులైన వారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి: 15 శాతం వృద్ధిరేటు.. దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ

Hyd_Tg_27_21_Akila Paksham On Inter Issue_Ab_C1 Note: Feed Etv Bharat Contributor: Bhushanam ( ) ఇంటర్మీడియట్ బోర్డు విషయంలో భవిష్యత్తు కార్యాచరణ పై హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. 9.25 లక్షల ఇంటర్ జవాబు పత్రాలు కేవలం 11రోజుల్లో కరెక్షన్ చేశారని... అంత తక్కువ రోజుల్లో ఇది ఎలా సాధ్యం అయిందని అఖిల పక్ష నాయకులు ప్రశ్నించారు. 3.25 లక్షల పేపర్ల మూల్యాంకనం కు ఇంకా సమయం ఎందుకు తీసుకుంటున్నారన్నారు. ఒక్క రోజులో ఒక్కక్కరు 110 పేపర్లు దిద్దినట్టు మాకు సమాచారం ఉందని...ఫలితాల విషయంలో గ్లోబారినా సంస్థ ఇంటర్ బోర్డును తొందర పెట్టిందన్నారు. మొదటిసారి దిద్దినప్పటి మార్కుల జాబితా, రీ వాలువేషన్ తర్వాత మార్కుల జాబితాను బహిర్గత పరచాలని కోరారు. ఇంటర్మీడియట్ వ్యవహారంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మళ్ళీ వాయిదా వేశారని... దీనివల్ల విద్యార్థులు నష్టపోతారని పేర్కొన్నారు. ఎన్ని నిరసనలు చేసినా ప్రభుత్వం కనీసం స్పందించడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బాద్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకొని... ఇంటర్మీడియట్ సమస్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బైట్: ఆచార్య పి.ఎల్. విశ్వేశ్వర్, అఖిల పక్ష నేత
Last Updated : May 21, 2019, 11:34 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.