తెలంగాణ ఆర్టీసీపై కేంద్ర ప్రభుత్వం వివక్షను మానుకోవాలని.. ప్రజా రవాణాను కాపాడాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. ఒకే దేశం ఒకే పన్ను అని నినదించే కేంద్రం... రైల్వేకు డీజిల్‌పై 4 శాతం పన్ను విధించి, ఆర్టీసీకి మాత్రం 31.83 శాతం విధించడం దారుణమని ఏఐటీయూసీ నాయకులు విమర్శించారు. కేంద్ర వైఖరికి నిరసనగా నాంపల్లిలోని హైదరాబాద్ కలెక్టరేట్ ముందు వారు ఆందోళనకు దిగారు.
ఈ పన్ను వ్యత్యాసం వల్ల ఆర్టీసీపై ఏటా రూ.622 కోట్లు అదనపు భారం పడుతుందని.. దాని ప్రభావం ప్రజా రవాణాపై ఉంటుందని పేర్కొన్నారు. కేంద్రం తన వైఖరి మార్చుకొని ఒకే పన్ను విధానాన్ని అమలు చేయాలన్నారు. డీజిల్,పెట్రోల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: రూపాయి ఖర్చు లేకుండా కిడ్నీలకు చికిత్స : ఇంద్రకరణ్ రెడ్డి