ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంలో.. ఓ విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. బెంగళూరు నుంచి వచ్చిన విమానం.. దాదాపు 40 నిమిషాలపాటు రౌండ్లు వేసింది.
ఉదయం 10 గంటల 10 నిమిషాలకు ల్యాండ్ కావాల్సిన ఉన్నా.. వాతావరణం అనుకూలించకపోవటంతో దిగలేదు. దీంతో ప్రయాణికులు కాస్త భయందోళనలకు గురయ్యారు. సురక్షితంగా దిగటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
ఇదీచదవండి: ప్రజా చైతన్యంతోనే కొవిడ్ మహమ్మారిని నిరోధిస్తాం: గవర్నర్