ETV Bharat / city

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏఐకేఎస్​సీసీ 'రైతుధర్నా'

హైదరాబాద్ ఇందిరాపార్క్​ వద్ద ఏఐకేఎస్​సీసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు, విద్యుత్ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయినవారికి పరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.

aikscc farmers protest at indira park in hyderabad
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏఐకేఎస్​సీసీ 'రైతుధర్నా'
author img

By

Published : Nov 9, 2020, 3:52 PM IST

కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లో అఖిల భారత రైతు పోటారాల సమన్వయ కమిటీ - ఏఐకేఎస్‌సీసీ ఆధ్వర్యంలో రైతు ధర్నా నిర్వహించారు. వ్యవసాయ రంగం, రైతు వ్యతిరేక చట్టాలకు ప్రత్యామ్నాయంగా ఏపీఎంసీ చట్టంలో సవరణలు చేయాలని డిమాండ్ చేస్తూ... ఇందిరా పార్క్ వద్ద ఆందోళన చేపట్టారు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో దెబ్బతిన్న పంటలకు సంబంధించి రైతులకు పరిహారం చెల్లించడం, అన్ని రకాల పంటలకు కనీస మద్దతు ధరలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

లాక్‌డౌన్​ అదనుగా చూసుకుని వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం 3 చట్టాలను తెచ్చిందని ఆరోపించారు. దీంతో వ్యవసాయ రంగం క్రమంగా కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లి రైతుల ఆత్మహత్యలు మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నూతన వ్యవసాయ చట్టాలు, విద్యుత్ బిల్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26, 27 తేదీల్లో చేపట్టిన ఛలో దిల్లీ కార్యక్రమం విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ నెల 22 నుంచి 24 వరకు రాష్ట్రవ్యాప్తంగా మండల, డివిజన్, జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, నిరసన ప్రదర్శనల్లో రైతులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నేతలు తీగల సాగర్, పశ్మ పద్మ, కన్నెగంటి రవి, రాయల చంద్రశేఖర్, ఉపేందర్‌రెడ్డి, ఏఐకేఎస్‌సీసీ జాతీయ ప్రతినిధులు వేములపల్లి వెంకటరామయ్య, విస్సా కిరణ్‌కుమార్, జంగారెడ్డి, ఏపూరి బ్రహ్మం, ఉషా సీతామహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: మరికొన్ని గంటల్లో దుబ్బాక ఉపఎన్నిక ఫలితం.. తేలనున్న భవితవ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.