తెలంగాణలో ఈ విద్యాసంవత్సరం 1,11,147 ఇంజినీరింగ్ సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) అనుమతినిచ్చింది. వాటిలో సుమారు మూడొంతుల సీట్లు కంప్యూటర్ సైన్స్, ఐటీకి సంబంధించినవే ఉండడం గమనార్హం. సుమారు 35వేలు మినహా మిగతా సీట్లన్నీ కంప్యూటర్ కోర్సుల్లోనే ఉన్నాయి. డిమాండ్ లేని 7,380 సీట్లను కళాశాలలు రద్దు చేసుకొని.. వాటి స్థానంలో ఐటీ సంబంధిత కోర్సుల్లో 7,815 సీట్లకు అనుమతి పొందాయి.
అత్యధికంగా కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో 28,435 సీట్లు ఉండగా.. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్(ఈసీఈ)లో 16,209, కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్‌లో 13,740 సీట్లకు అనుమతి లభించింది. సీఎస్‌ఈ డేటా సైన్స్‌లో 8,910, సివిల్స్‌లో 6,765, ఈఈఈలో 7,417, ఐటీలో 7,440, మెకానికల్‌లో 6,351 సీట్లు ఉన్నాయి. గతేడాది 192 కాలేజీల్లో 1,11728 సీట్లకు ఏఐసీటీఈ ఆమోదం తెలిపింది. ఈ ఏడాది కాలేజీల సంఖ్యలో మార్పు లేదు. అయితే, ఏఐసీటీఈ ఆమోదించినప్పటికీ.. జేఎన్‌టీయూ, ఓయూ అనుబంధ గుర్తింపును ఇవ్వాల్సి ఉంది.
ఇదీ చూడండి : ఎన్డీఏ ప్రభుత్వంలో ఎన్పీఏల దందా నడుస్తోంది..: సీఎం కేసీఆర్