ETV Bharat / city

ప్రారంభమైన ఉభయసభల సమావేశాలు.. - నేడు ఉభయ సభల భేటీ

Telangana Assembly Sessions 2022: ఐదు రోజుల విరామం అనంతరం ఉభయ సభల సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఉభయసభల్లో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ బిల్లు, దాని ప్రభావాలపై రాష్ట్ర ఉభయసభల్లో చర్చ జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం 7 బిల్లులను ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. సభాపతిని ఉద్దేశించి భాజపా సభ్యుడు ఈటల చేసిన వ్యాఖ్యల అంశం ప్రస్తావనకు రానుంది.

Telangana Assembly
Telangana Assembly
author img

By

Published : Sep 12, 2022, 6:50 AM IST

Updated : Sep 12, 2022, 10:07 AM IST

Telangana Assembly Sessions 2022: శాసనసభ, శాసనమండలి తిరిగి సమావేశం అయ్యాయి. ఐదు రోజుల విరామం అనంతరం ఈరోజు ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభల్లోనూ ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. దీంతో నేరుగా స్వల్పకాలిక చర్చ చేపడతారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ బిల్లు, దాని ప్రభావాలపై అసెంబ్లీ, కౌన్సిల్‌లో చర్చ జరగనుంది. కేంద్రం ప్రతిపాదిస్తున్న విద్యుత్ బిల్లు వల్ల రాష్ట్రంలో రైతులకు తీవ్రంగా నష్టం జరుగుతుందని పదేపదే చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఉభయసభల వేదికగా ఇవాళ మరోమారు తన వైఖరిని మరింత గట్టిగా స్పష్టం చేయనుంది.

ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని సర్కార్ భావిస్తోంది. అవసరమైతే అధికారిక తీర్మానం కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉందని అంటున్నారు. శాసనసభ ముందుకు ఇవాళ ఆరు బిల్లులు రానున్నాయి. జీఎస్టీ చట్ట సవరణ, నిజామాబాద్‌ పారిశ్రామిక ప్రాంత చట్ట సవరణ, పురపాలక నిబంధనల చట్ట సవరణ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. వైద్యవిద్యా శాఖలో డీఎంఈ, అసిస్టెంట్ డీఎంఈల పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచుతూ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ పదవీ విరమణ నియంత్రణ చట్ట సవరణ బిల్లును కూడా ప్రవేశపెట్టనుంది. సిద్దిపేట జిల్లా ములుగు అటవీ కళాశాల, పరిశోధనా సంస్థను విశ్వవిద్యాలయంగా మార్చే అటవీ విశ్వవిద్యాలయం బిల్లు, విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లులు కూడా సభ ముందుకు రానున్నాయి. మోటారు వాహనాల పన్ను చట్ట సవరణ బిల్లును కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.

సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి భాజపా శాసనసభ్యుడు ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యల అంశాన్ని పాలకపక్షం సభలో ప్రస్తావించే అవకాశం ఉంది. ఈటల బేషరతు క్షమాపణ చెప్పాలని శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇప్పటికే డిమాండ్ చేశారు. ఇవాళ సభలో మరోమారు ప్రస్తావించి ఈటల రాజేందర్ స్పందనను బట్టి తదుపరి ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఖమ్మం జిల్లా పాలేరు మాజీ ఎమ్మెల్యే, దివంగత భీమపాక భూపతిరావుకు అసెంబ్లీ సంతాపం ప్రకటించనుంది.

వాడిగా, వేడిగా జరిగే అవకాశం: రాష్ట్రంలోని అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కేంద్ర ప్రభుత్వ వివక్ష, విభజన హామీల అమలులో వైఫల్యం, కొత్త ప్రాజెక్టులు ఇవ్వకపోవడం తదితర అంశాలపై శాసనసభ వేదికగా తన వాణి బలంగా వినిపించేందుకు అధికారపక్షం సిద్ధమయింది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకున్న ఈ సమావేశాల్లో వాడి, వేడి రాజకీయ చర్చలు జరిగే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటనలు చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి:

Last Updated : Sep 12, 2022, 10:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.