ETV Bharat / city

మరో 1,540 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ - తెలంగాణలో ఏఈఈ నోటిఫికేషన్

job
job
author img

By

Published : Sep 3, 2022, 7:44 PM IST

Updated : Sep 4, 2022, 6:41 AM IST

19:40 September 03

వివిధ విభాగాల్లో 1,540 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

రాష్ట్రంలోని పలు విభాగాల్లో 1,540 సహాయ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (ఏఈఈ) పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. సివిల్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌, అగ్రికల్చర్‌ విభాగాల్లో ఇంజినీరింగ్‌ లేదా తత్సమాన అర్హత కలిగిన అభ్యర్థులతో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ ప్రకటనలో అత్యధికంగా సివిల్‌ ఇంజినీరింగ్‌ పోస్టులు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబరు 22 నుంచి అక్టోబరు 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని కమిషన్‌ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ సూచించారు. పోస్టుల వారీగా పూర్తి వివరాలు, వాటికి సంబంధించిన విద్యార్హతలను ఈ నెల 15న కమిషన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు.

....

ఏఎంవీఐ పోస్టుల నోటిఫికేషన్‌ రద్దు... రవాణా శాఖలో అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఏఎంవీఐ) పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ రద్దు చేసింది. అభ్యర్థులకు హెవీ లైసెన్స్‌ ఉండాలన్న నిబంధనపై పలు అభ్యంతరాలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అర్హతల విషయంలోనూ అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వచ్చాయని.. వాటిని రవాణాశాఖకు తెలియజేసినట్లు టీఎస్‌పీఎస్సీ వివరించింది. 113 ఏఎంవీ పోస్టుల భర్తీకి జులై 27న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఇవీ చదవండి:

Last Updated : Sep 4, 2022, 6:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.