ETV Bharat / city

ఇదేం ఆచారం రా బాబు ఏకంగా ముళ్ల కంప పైనే పడుకున్నాడు.. చూస్తే షాక్‌ అవ్వాల్సిందే!

Priest Adventure సాధారణంగా మనకు ఒక ముళ్లు గుచ్చుకుంటేనే విలవిల్లాడతాము. అలాంటిది ఓ గ్రామంలో నిర్వహించిన అమ్మవారి జాతరలో ఓ పూజారి చేసిన సాహసం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ముళ్ల కంపలపై నడుస్తూ దానిపైనే పడుకుంటూ సాహసం చేశాడు. ఈ ఘటన ఏపీలోని అనంతపురం జిల్లాలో జరిగింది. ఈ ఆచారం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోందని స్థానికులు చెబుతున్నారు.

Priest Adventure
పూజారి సాహసాలు
author img

By

Published : Sep 8, 2022, 5:51 PM IST

Adventure of Priest : ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా బెళుగుప్ప తండాలో గత మూడు రోజుల నుంచి మారెమ్మ అమ్మవారి జాతర ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయ పూజారి చేసిన సాహసం అక్కడున్నవారిని ఆకట్టుకుంది. కుప్పగా పేర్చిన ముళ్లకంపలపై నడుచుకుంటూ వెళ్లడం, అక్కడే పడుకోవడం వంటి సాహసాలు చేశాడు. అది చూసిన భక్తులు ఆశ్చర్యానికి లోనయ్యారు.

ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, హోమాలు, తదితర కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలో ఉన్న యువతులు వేసిన లంబాడి నృత్యం పలువురిని ఆకట్టుకుంది. అనంతరం సిరిమానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పొడవాటి మొద్దుకు పూజారిని కట్టి పైకి ఎత్తి గాలిలో తిప్పారు. మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ గీతాలాపన కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.