కరోనా టీకా ఎంతో సురక్షితమని.. తనతో పాటు తన సిబ్బంది అందరూ తీసుకున్నారని అదనపు డీజీ స్వాతి లక్రా తెలిపారు. హైదరాబాద్ సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో స్వాతిలక్రాతో పాటు డీఐజీ సుమతి.. కొవిడ్ టీకా మొదటి డోస్ తీసుకున్నారు. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు.
టీకాపై వచ్చే వదంతులను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. టీకా వేయించుకున్నప్పటికీ మాస్కులు ధరిస్తూ.. భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా సమయంలో పోలీసులు అందించిన సేవలను కొనియాడారు.
రాష్ట్రంలోని పోలీసు, పురపాలక, రెవెన్యూ, పంచాయతీ శాఖల సిబ్బందికి ఈ నెల 6 నుంచి కొవిడ్ టీకాలను అందిస్తున్నారు. ఈ శాఖలకు చెందిన 2 లక్షలకు పైగా లబ్ధిదారులు టీకాను పొందనున్నారు.
ఇదీ చూడండి: ఉపాధి పేరిట మహిళల అక్రమ రవాణా... ముఠా అరెస్ట్