TTD EO Dharmareddy: తిరుమలలో వేసవి రద్దీ దృష్ట్యా అష్టాదళం, తిరుప్పాడ ఆర్జిత సేవలను జూన్ 30 వరకు తాత్కాలికంగా రద్దు చేశామని తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. ఈ ఉదయం తిరుమల అన్నమయ్య భవనంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరగడంతో భక్తుల సందేశాలు, సూచనలను ధర్మారెడ్డి ఫోన్ ద్వారా తెలుసుకున్నారు.
శ్రీవారి ఆలయంలో పటిష్టమైన భద్రత ఉందని గత రెండు దశాబ్దాల్లో ఎప్పుడూ చోరీ జరగలేదని అన్నారు. శ్రీవారి హుండీలో చోరీ జరిగితే విజిలెన్స్ అధికారులు ఎప్పటికప్పుడు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకుంటారని తెలిపారు.
ఇదీ చదవండి: బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు.. 48 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే..