ETV Bharat / city

స్పీడ్ పెరుగుతోంది.. ప్రాణం పోతుంది!

లాక్​డౌన్ నిబంధనల్లో సడలింపులు ఇవ్వగా వాహనాల రాకపోకలు క్రమంగా పెరుగుతున్నాయి. రహదారులపై ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. లాక్​డౌన్ అమలు చేసినప్పటి నుంచి పోలిస్తే చివరి వారం రోజుల్లో ప్రమాదాలు 6 రెట్లు పెరిగాయి.

accidents toll rises in telangana
స్పీడ్ పెరుగుతోంది.. ప్రాణం పోతుంది!
author img

By

Published : May 14, 2020, 12:12 PM IST

కరోనాను అరికట్టడానికి ప్రభుత్వం లాక్​డౌన్ విధించింది. క్రమంగా దీన్ని పొడిగిస్తూ వస్తున్న తరుణంలో... ప్రజలు తమ అవసరాల కోసం బయటికి రావడం మొదలుపెట్టారు. రోడ్లు నిర్మానుష్యంగా ఉన్నందున పనిమీద బయటికొచ్చిన వారు వాహనాలను వేగంగా నడుపుతున్నారు. ఈ క్రమంలో కొన్నిచోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. మే నెల మొదటి నుంచే రొడ్డెక్కే వాహనాల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. మొదటి 13రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 388 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.

145 ఘోర ప్రమాదాలు..

రాష్ట్రంలో ఏటా 22వేల ప్రమాదాలు జరుగుతుంటాయి. సగటున రోజులు 60 ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. లాక్​డౌన్ అమలు చేసిన కొత్తలో రోజు 5 ప్రమాదాలు జరిగాయి. మొదటి యాభై రోజుల వరకు ఈ సంఖ్య సరాసరి 5 గానే ఉంది. కానీ మే మాసంలో ఈ సంఖ్య పెరిగింది. మొదటి 13 రోజుల్లో 388 ప్రమాదాలు జరిగాయి. ఇందులో 243 సాధారణ ప్రమాదాలు కాగా, 145 ఘోర ప్రమాదాలు. ఈ ప్రమాదాల్లో 154మంది మృతి చెందారు.

6 రెట్లు పెరిగాయి..

రోజుకు సగటున 30 వరకు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. లాక్​డౌన్ సమయంలో మొదటి నెలన్నరతో పోలిస్తే ప్రమాదాలు 6 రెట్లు పెరగడం గమనార్హం. వాహనాల రాకపోకలు పెరగడం ఒక కారణమైతే.. మద్యం షాపులు తెరుచుకోవడం కూడా మరో కారణం. ప్రస్తుతం కరోనా విధుల్లోనే తలమునకలైన పోలీసులు.. మద్యం సేవించి వాహనాలు నడిపేవారి తనిఖీలు నామమాత్రంగానే చేపడుతున్నారు. ఎండ వేడిమికి మధ్యాహ్నం 12గంటల తర్వాత రహదారులు నిర్మానుషంగా మారుతున్నాయి. వానహదారులు వేగంగా దూసుకుపోతూ ప్రమాదాలకు గురవుతున్నారు.

ప్రత్యేక దృష్టి..

లాక్ డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించి రహదారులపైకి వచ్చిన 2.2 లక్షల వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సడలింపు ఇవ్వడం వల్ల వాహనాల రాకపోకలు పెరిగాయి. పోలీసుల తనిఖీలకు కాస్త ఇబ్బంది ఏర్పడినప్పటికి.. ప్రమాదాల నివారణపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.

ఇవీ చూడండి: బ్లాక్​ పాంథర్​ కాదది.... మానుపిల్లే... !!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.