ఏపీలోని అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండల కేంద్రం సమీపంలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి పరిస్థితిని గమనించి తన వాహనాన్ని ఆపారు.
క్షతగాత్రురాలిని తన వాహనంలో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మహిళను పరీక్షించిన వైద్యులు.. అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఆమె ప్రాణాలు కోల్పోయారు. యువతి మృతి విషయం తెలుసుకున్న దివాకర్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు.
మృతురాలిది బుక్కరాయ సముద్రం మండలం కొట్టాలపల్లి గ్రామంగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: Elephant Attack : చిత్తూరు జిల్లాలో ఏనుగు విధ్వంసం.. రైతు మృతి