ఓటుకు నోటు కేసు నుంచి సెబాస్టియన్ను తొలగించేందుకు ఏసీబీ న్యాయస్థానం నిరాకరించింది. సెబాస్టియన్ దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ను కొట్టేసింది. ఓటుకు నోటు వ్యవహారంతో తనకు సంబంధం లేదని... ఏసీబీ అనవసరంగా ఇరికించిందని సెబాస్టియన్ వాదించగా... ఆయన ప్రమేయంపై పూర్తి ఆధారాలున్నాయని అనిశా వివరించింది.
ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం... సెబాస్టియన్ అభ్యర్థనను తోసిపుచ్చింది. ఈ కేసులో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్ సింహ డిశ్చార్జ్ పిటిషన్లను కూడా న్యాయస్థానం ఇప్పటికే కొట్టేసింది. అభియోగాల నమోదు ప్రక్రియ ప్రారంభించేందుకు విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది.
ఇదీ చూడండి: 'మహిళలను స్తంభాలెక్కే పరీక్షకు అనుమతించండి'