ETV Bharat / city

పసిపిల్లలకు ఏసీ వేస్తున్నారా.. అయితే జాగ్రత్త! - ఏసీ టెంపరేచర్

AC for Kids : ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 దాటిన తర్వాత బయట అడుగుపెట్టాలంటే భయం పుడుతోంది. మధ్యాహ్నం పూట ఇంట్లో ఉక్కపోత భరించలేకుండా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పెద్దలే ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. ఇక పసిపిల్లల సంగతి చెప్పనక్కర్లేదు. అలా అని వారిని ఎక్కువ సేపు ఏసీ గదుల్లో ఉంచితే మంచిది కాదంటున్నారు వైద్యనిపుణులు. ఏసీ గదుల్లో పిల్లలను ఉంచేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. అవేంటంటే..

AC for Kids
AC for Kids
author img

By

Published : Apr 26, 2022, 1:39 PM IST

AC for Kids : ఎండలకు మనమే తట్టుకోలేకపోతున్నాం. ఇక పసివాళ్ల సంగతేంటి? ‘అందుకేగా ఏసీ ఏర్పాటు చేశాం’ అంటారా? అయితే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే కొత్త సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది.

  • పిల్లలు గదిలో ఉన్నప్పుడు ఏసీ వేయొద్దు. ముందుగానే వేసి, వాతావరణం చల్లబడ్డాకే పిల్లల్ని గదిలోకి తీసుకెళ్లాలి. ఉష్ణోగ్రత 27 డిగ్రీలకంటే తగ్గకుండా చూసుకోవాలి. చల్లదనం నేరుగా వారి ముఖానికి తగలకుండా చూసుకోవాలి.
  • ఏకధాటిగా వేసి ఉంచాల్సిన పనిలేదు. గది చల్లబడింది అనిపించాక ఆపేయొచ్చు. తలుపులు తరచూ తెరవకుండా ఉంటే చాలు.
  • ఏసీ గాలికి పిల్లల లేత చర్మం పొడిబారుతుంది. కాబట్టి, ఎక్కువగా మాయిశ్చరైజర్‌ రాయండి. చేతులు, కాళ్లు కప్పే దుస్తుల్ని వేయాలి. ఇవి చలి నుంచి వారిని కాపాడతాయి. టోపీని కూడా పెట్టండి. దుప్పటి కప్పుతుంటే మోచేతుల కిందకే ఉండేలా చూసుకోండి.
  • నిర్ణీత కాలవ్యవధుల్లో తప్పకుండా సర్వీసింగ్‌ చేయించండి. దీనిలోనూ దుమ్ము చేరుతుంటుంది. ఈ సూక్ష్మకణాలు వాళ్లలో ఆస్తమా, అలర్జీలకు కారణమవుతాయి. అందుకే సర్వీసింగ్‌ తప్పని సరి.
  • ఇంట్లో ఒక గదిలోంచి ఇంకో గదిలోకి పిల్లల్ని తీసుకెళ్లడం మామూలే. కానీ ఒక్కసారిగా చల్లటి వాతావరణం నుంచి వేడి ఉన్న ప్రదేశంలోకి తీసుకెళ్లొద్దు. ఇది అనారోగ్యానికి దారి తీస్తుంది.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.