ETV Bharat / city

ఏబీవీపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత ఇంటి ముట్టడి

నిజామాబాద్​లోని ఎమ్మెల్సీ కవిత ఇంటిని... ఏబీవీపీ ఆధ్వర్యంలో ముట్టడించారు. తెలంగాణలో అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై కేసీఆర్, కేటీఆర్ నిర్ణయం ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.

ఏబీవీపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత ఇంటి ముట్టడి
ఏబీవీపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత ఇంటి ముట్టడి
author img

By

Published : Oct 15, 2020, 5:38 PM IST

తెలంగాణలో ఈడబ్ల్యూఎస్​ కోటా అమలు చేయాలని నిజామాబాద్​లోని ఎమ్మెల్సీ కవిత ఇంటిని... ఏబీవీపీ ఇందూరు శాఖ ఆధ్వర్యంలో ముట్టడించారు. అగ్రవర్ణ పేదలకు విద్యా, ఉపాధి రంగాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ... కేంద్రం చట్టం చేసినప్పటికీ తెలంగాణలో అమలు చేయడం లేదని ఆరోపించారు.

నీట్​లో ఓబీసీకి 27 శాతం రిజర్వేషన్లు కల్పించడం లేదని తెరాస విద్యార్థి విభాగం నాయకులు తప్పడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈడబ్ల్యూఎస్​ కోటా అమలుపై కేసీఆర్​, కేటీఆర్​ సమాధానం కోసం తెలంగాణ సమాజం ఎదురుచూస్తోందని... వెంటనే వారి వైఖరిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్​కు తరలించారు.

ఇదీ చదవండి: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి.. విషాదంలో కుటుంబీకులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.