ETV Bharat / city

Viral Video: అధిక వడ్డీల ఆశజూపి.. ఆపై అసభ్యంగా మాట్లాడినందుకు మహిళ దేహశుద్ధి - video viral

Viral Video: ఏపీలో అధిక వడ్డీ ఆశజూపి మోసం చేసిన బీసీ సంక్షేమ సంఘం గుంటూరు జిల్లా మాజీ అధ్యక్షుడు రంగనాథ్​కు ఓ మహిళ దేహశుద్ధి చేసింది. డబ్బులు తీసుకొని ఇవ్వకపోగా.. తన గురించి అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని భర్తతో కలిసి దాడి చేసింది. ఈ దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి.

woman attacking a man video viral
బీసీ సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షుడికి మహిళ దేహశుద్ధి
author img

By

Published : Mar 28, 2022, 5:00 PM IST

Viral Video: అధిక వడ్డీల ఆశజూపి అమాయకుల నుంచి రూ. లక్షలు తీసుకొని.. తీరా డబ్బులడిగేసరికి పారిపోవడమో లేక బెదిరింపులకు పాల్పడటమో తరహా ఘటనలు తరచూ వార్తల్లో రావడం చూస్తూనే ఉన్నాం. అన్యాయం జరిగాక పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఆ మోసం చేసినవాడు దొరికినా మన సొమ్ము మనకు వస్తుందనే నమ్మకం లేదు. కానీ ఓ మహిళ మాత్రం ఇలా చూస్తూ కూర్చోలేదు. అధిక వడ్డీల పేరుతో తన వద్ద డబ్బు వసూలు చేసిన ఓ వ్యక్తికి దేహశుద్ధి చేసి బుద్ధి చెప్పింది ఆ మహిళ.

ఆంధ్రప్రదేశ్​లో బీసీ సంక్షేమ సంఘం గుంటూరు జిల్లా మాజీ అధ్యక్షుడు పరాశ రంగనాథానికి ఓ మహిళ దేహశుద్ధి చేసింది. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా పని చేసిన సమయంలో మహిళలకు మాయమాటలు చెప్పి నగదు తీసుకోవడంతోపాటు, నమ్మించి మోసం చేశాడని కొంతమంది మహిళలు మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా రంగనాథం ఆగడాలు భరించలేని ఓ మహిళ.. రెండు రోజుల క్రితం అతని​పై దాడికి పాల్పడింది. అధిక వడ్డీ ఇస్తానంటూ రూ.15 లక్షలు తీసుకున్నాడని పేర్కొంది. ఆ డబ్బులు ఇవ్వకపోగా తన గురించి అసభ్యంగా మాట్లాడుతున్నాడంటూ.. భర్తతో కలిసి రంగనాథానికి దేహశుద్ధి చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దృశ్యాలు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

బీసీ సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షుడికి మహిళ దేహశుద్ధి

ఇదీ చదవండి: Srinivas Goud Murder Plan Case: 'బెయిల్ ఇస్తే నిందితులు దుష్ప్రచారాలు చేస్తారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.