అనాథశ్రమంలో మృతి చెెందిన బాలిక మృతిపై మహిళా, శిశు సంక్షేమశాఖ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. కమిటీలో బాలల హక్కుల కమిషన్, బాలల సంరక్షణ కమిటీ సభ్యులు, ఏసీపీ ప్రతాప్ సభ్యులుగా ఉన్నారు.
ఆశ్రమం నుంచి తీసుకువచ్చాక ఏం జరిగిందనే విషయంపై కమిటీ సభ్యులు విచారణ చేపట్టనున్నారు. సమావేశం తర్వాత బాలిక కుటుంబసభ్యులు, బంధువులను కలవనున్నారు.