ETV Bharat / city

విశాఖ తీరానికి 25 వేల టన్నుల అమ్మోనియం నైట్రేట్

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ తీరానికి 25 వేల టన్నుల అమ్మోనియం నైట్రేట్ లోడుతో ఓ నౌక వచ్చింది. ఇప్పటికే తీరంలో ఉన్న వేల టన్నుల అమ్మోనియం నైట్రేట్ నిల్వలను గమ్యస్థానాలకు తరలించే ప్రక్రియ పూర్తికాకముందే... మరో నౌక రావటం కలకలం రేపింది.

a-ship-carrying-25000-tonnes-of-ammonium-nitrate-came-ashore-in-visakhapatnam
విశాఖ తీరానికి 25 వేల టన్నుల అమ్మోనియం నైట్రేట్
author img

By

Published : Aug 13, 2020, 12:38 PM IST

రష్యా నుంచి 25 వేల టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ లోడుతో ఒక నౌక బుధవారం ఏపీలోని విశాఖ తీరానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో నౌకాశ్రయ వర్గాలు అప్రమత్తమయ్యాయి. లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో అమ్మోనియం నైట్రేట్‌ పేలుడు కారణంగా ఇటీవల భారీ విధ్వంసం జరిగింది. బీరుట్‌లో సంఘటన జరిగిన సమయానికి విశాఖలో మొత్తం 18,500 టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ నిల్వలు ఉన్నాయి. విశాఖలో నిల్వ చేస్తున్న వేల టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ కారణంగా సమీపంలోని పలు కీలక ప్రభుత్వ, ప్రైవేటు, రక్షణ రంగ సంస్థలకు తీవ్రమైన ముప్పు పొంచి ఉందని ఆందోళన ఇటీవల వ్యక్తమైంది.

బీరుట్‌ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని, విశాఖ తీరానికి ఈ సరుకు రవాణా జరుగుతున్న తీరుపై నౌకాశ్రయ ఛైర్మన్‌ రామ్మోహనరావు సమీక్షించారు. అధికారులు ఆయా నిల్వలున్న గోదాములు పరిశీలించారు. నిల్వలు వేగంగా గమ్యస్థానాలకు తరలిచాలని స్పష్టం చేశారు. అయితే ఆ నిల్వల తరలింపు ప్రక్రియ ఇంకా పూర్తికాక ముందే మరో నౌక విశాఖ రావడం చర్చనీయాంశమైంది. విశాఖ నౌకాశ్రయానికి అమ్మోనియం నైట్రేట్‌తో మరో నౌక రావడం వాస్తవమేనని నౌకాశ్రయ ఛైర్మన్‌ రామ్మోహనరావు వెల్లడించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సరుకును గోదాములకు పంపుతామన్నారు.

ఇదీ చదవండి

అమ్మోనియం నైట్రేట్ ఎంత ప్రమాదకరం?... దీనివల్ల విశాఖకు ముప్పు ఉందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.