ETV Bharat / city

ఒక్కసారిగా పొలంలో భారీ గొయ్యి.. చూస్తే వామ్మో అనాల్సిందే..!! - Pit Formed in termeric field

A Huge pit in the field: ఓ రైతు పొలంలో పసుపు పంట సాగు చేస్తున్నాడు. ఈ రోజు ఉన్నట్టుండి పొలంలో భారీ గొయ్యి ఏర్పడింది. విషయం తెలుసుకుని రైతు పొలం దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లాడు. గొయ్యి చూసి షాక్​కు గురయ్యాడు. గొయ్యితో భారీ నష్టం జరిగిందని వాపోయాడు. కొంతకాలంగా మండల పరిధిలో ఇలాంటి గోతులు ఏర్పడుతున్నాయని... ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Huge pit
Huge pit
author img

By

Published : Sep 7, 2022, 7:46 PM IST

A Huge pit in the field: ఆంధ్రప్రదేశ్​లోని వైఎస్ఆర్ జిల్లా చింతకొమ్మదిన్నె మండల పరిధిలో ఓ రైతు పొలంలో భారీ గొయ్యి ఏర్పడింది. బయనపల్లి గ్రామానికి చెందిన విష్ణువర్ధన్​రెడ్డి అనే రైతు తన భూమిలో పసుపు పంట సాగు చేస్తున్నాడు. ఈరోజు ఉన్నట్టుండి పసుపు పంట సాగు చేస్తున్న ప్రదేశంలో భూమి కుంగిపోయింది. దీంతో 30 అడుగుల వెడల్పు.. 35 అడుగుల లోతు గొయ్యి ఏర్పడింది. విషయం తెలుసుకున్న రైతు హుటాహుటిన అక్కడకు చేరుకున్నాడు. గుంతలో చూడగా నీళ్లు ఉన్నాయి. ఇలా ఏర్పడటం వల్ల పంట, భూమి నష్టపోతున్నానని రైతు అవేదన వ్యక్తం చేశాడు.

గత కొన్నేళ్ల నుంచి చింతకొమ్మదిన్నె మండల పరిధిలో పొలాల్లో భూమి కుంగిపోవడం పరిపాటిగా మారింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏ భూమి కుంగిపోతుందో తెలియక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. రైతులు పొలాల్లోకి పనులకు వెళ్లాలంటే భయపడుతున్నారు. అధికారులు స్పందించి శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. ఇలా భూమి కుంగిపోవడం వల్ల తమకు నష్టం వాటిల్లుతుందని.. పంట పొలాలు సాగు చేయలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు.

పొలంలో భారీ గొయ్యి.. ఆదుకోవాలని రైతు ఆవేదన

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.