భాగ్యనగరంలో భారీ జాబ్ మేళా జరగనుంది. మాసబ్ ట్యాంక్‌లోని ఖాజా మ్యాన్సన్ వద్ద ఈ నెల 8న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఇందులో దాదాపు 40కి పైగా కంపెనీలు పాల్గొనన్నాయి. ఫ్రెషర్స్‌తోపాటు అనుభవం కలిగిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. పది, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని నిర్వాహకులు తెలిపారు.
ఆసక్తి గల అభ్యర్థులు ధ్రువపత్రాలు, బయోడేటా, ఫోటోలు తీసుకురావాలని నిర్వాహకులు సూచించారు. మరింత సమాచారం కోసం 8374315052 నంబర్‌కు ఫోన్ చేయవచ్చని వెల్లడించారు.
ఇదీ చూడండి: