హైదరాబాద్లోని కేపీహెచ్బీ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ ప్రైవేటు వసతి గృహంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన దుర్గా సాయికృష్ణ తేజ్... బీటెక్ మధ్యలో ఆపేశాడు. ఈ నెల 2న ఇంటి నుంచి చెప్పకుండా వెళ్లాడు. ఈ నెల 6న కేపీహెచ్బీలోని సాయి సుధా హాస్టల్లో చేరాడు.
ఇవాళ తెల్లవారుజామున హాస్టల్ కారిడార్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాస్టల్ సిబ్బంది సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు... కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చి పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చూడండి: అయేషా మీరా మృతదేహానికి మరోసారి శవపరీక్ష