ఏపీ నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని ఆనందయ్య ఆయుర్వేదిక్ మందుల పంపిణీపై అనంతపురం జిల్లాకు చెందిన మాదినేని ఉమామహేశ్వర నాయుడు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కృష్ణపట్నంలో కరోనా నివారణ కోసం ఆనందయ్య ఆయుర్వేద మందు ఇస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు.
మందు తీసుకుని అనేకమంది కోలుకున్నారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఈ మందు పంపిణీని నిలిపివేసిందన్నారు. ఫలితంగా అనేకమంది ఈ మందును తీసుకోలేకపోతున్నారని తెలిపారు. హౌస్ మోషన్ పిటిషన్పై ఇంకా హైకోర్టు నుంచి అనుమతి రాలేదు.