ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా కేంద్రంలోని మహమ్మదీయ షాపింగ్ కాంప్లెక్స్‌లో... విద్యుదాఘాతం కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. సమీపంలోని ఐదు దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి.
ప్రమాదంపై అప్రమత్తమైన స్థానికులు.. అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. రెండు ఫైరింజన్లతో మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు. రూ.25 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి: లోటస్‌పాండ్‌లో అభిమానులతో షర్మిల సమావేశం