హైదరాబద్‌లో ఎక్కడపడితే అక్కడ కుప్పలు కుప్పలుగా టులెట్ బోర్డులు వ్యాపార, వాణిజ్య, నివాస ఇల్లు ప్రకటనలు కనిపిస్తుంటాయి. ఇక అమీర్పెట్, దిల్సుఖ్ నగర్ వంటి ప్రాంతాల్లో అయితే గృహ సముదాయాలు, వాణిజ్య కాంప్లెక్స్‌లు కనిపించకుండా నింపెస్తుంటారు. వీటన్నింటికి ఫైన్లు వేసి తొలగించే కార్యక్రమాన్ని జీహెచ్‌ఎంసీ ఇదివరకే చేపట్టగా.. ఇప్పుడు అధికారులు రంగలోకి దిగారు.
అనుమతి లేకుండా ఏర్పాటు చేసే టులెట్ బోర్డులు, గోడపత్రికల బహిరంగ ప్రచారాలపై ఇప్పటికే నిషేధం ఉండగా సరియైన అవగాహన లేని కారణంగా ఈ విషయం చాలామందికి తెలియదు. టులెట్ బోర్డులు, గోడపత్రికలు పెట్టేవారికి జీహెచ్‌ఎంసీ అధికారులు జరిమానా విధిస్తున్నారు.
మూసాపేట డివిజన్‌లో
మూసాపేట డివిజన్‌లోని ఓ దుకాణ యజమాని ఏర్పాటు చేసిన ‘టులెట్’ స్టిక్కర్‌కు అధికారులు రూ.2 వేల జరిమానా విధిస్తూ మంగళవారం నోటిసులు జారీ చేశారు. టులెట్ బోర్డు పెట్టాలంటే అనుమతి తీసుకోవాలనే విషయం తెలియని ఓ దుకాణ యజమాని.. జీహెచ్‌ఎంసీ అధికారులు నోటిసు ఇవ్వడంతో ఆవాక్కయ్యాడు.
మోతీనగర్ డివిజన్‌లో
మోతీనగర్ డివిజన్‌లోని పాండు రంగానగర్ చౌరస్తాలో స్థానిక వ్యాపారి ఎరమల్ల లాలయ్యగౌడ్ తనకు ఉన్న రెండు మడిగెలలో ఒకదాంట్లో సొంతంగా వ్యాపారం చేస్తు.. రెండోది అద్దెకు ఇవ్వగా అది ఖాళీ అయ్యింది. దీంతో ‘టులెట్’ పేరుతో వ్యాపారి సొంత గోడకు ఓ గోడప్రతిని అంటించారు. దాన్ని నేరంగా పరిగణించిన జీహెచ్‌ఎంసీ ఈడీ, డీఎం డైరెక్టర్ రూ.2 వేల జరిమానా విధిస్తూ మంగళవారం నోటీసు అందించారు. 24 గంటల్లో ఈ-చలానా ద్వారా జరిమానా చెల్లించాలని అందులో తెలిపారు. ఇదెక్కడి చోద్యంరా.. బాబు అంటూ వ్యాపారి తలపట్టుకున్నాడు.
ఇదీ చదవండి: