ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్గా నిలబడిన కుమార్తెకి ఓటు వేసిన ఓ వృద్ధుడు.. అనంతరం పోలింగ్ కేంద్రానికి సమీపంలోనే మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లా రామసముద్రంలో చోటుచేసుకుంది.
రామసముద్రం గ్రామానికి చెందిన గంగప్ప(65).. పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్గా నిలబడిన కూతురికి ఓటు వేయడానికి ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి చేరుకున్నాడు. ఓటును వినియోగించుకున్న అనంతరం.. పోలింగ్ కేంద్రం బయటకు వచ్చి సొమ్మసిల్లి పడిపోయాడు.
అప్రమత్తమైన కుటుంబసభ్యులు బాధితుడిని ఆటోలో ఇంటికి తీసుకెళ్తుండగా.. మార్గ మధ్యలోనే ఆయన మరణించారు. ఇంటి పెద్ద మరణంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది.
ఇదీ చదవండి: షర్మిల ఖమ్మం పర్యటన వాయిదా