ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. 24 గంటల్లో కొత్తగా 8,732 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 2,81,817కు చేరింది. మహమ్మారి బారిన పడి మరో 87 మంది మృతి చెందగా.. మొత్తం 2,562 మంది కొవిడ్కాటుకు బలయ్యారు.
ఏపీలో కరోనా నుంచి 1,91,117 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 88,138 యాక్టివ్ కేసులున్నాయి. 24 గంటల వ్యవధిలో 53,712 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు 28.12 లక్షల మందికి కొవిడ్ పరీక్షలు చేశారు.
జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు..
ఇవీచూడండి: ఇవాళ, రేపు భారీ వర్షాలు..19న మరో అల్పపీడనం