ETV Bharat / city

Numaish in Hyderabad 2022: నుమాయిష్​ సందడి షురూ.. వాళ్లకు మాత్రం నో ఎంట్రీ.. - వ్యాక్సినేషన్‌ కేంద్రం

Numaish in Hyderabad 2022: హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన(నుమాయిష్‌)ను గవర్నర్‌ తమిళిసై చేతుల మీదుగా ప్రారంభమైంది. ఆరెకరాల స్థలంలో 1,500 వరకు స్టాళ్లు ఏర్పాటు చేశారు. నో మాస్క్‌.. నో ఎంట్రీ పద్ధతిని అమలు చేస్తున్నారు. ఎగ్జిబిషన్‌లో రౌండ్‌ ది క్లాక్‌ ఫ్రీ వ్యాక్సినేషన్‌ కేంద్రం కూడా ఏర్పాటు చేయటం గమనార్హం.

81st Numaish exhibition 2022 started in Hyderabad by governor tamilisai

author img

By

Published : Jan 1, 2022, 6:47 PM IST

Updated : Jan 1, 2022, 8:16 PM IST

నుమాయిష్​ సందడి షురూ.. వాళ్లకు మాత్రం నో ఎంట్రీ..

Numaish in Hyderabad 2022: హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో 81వ నుమాయిష్‌ ప్రారంభమైంది. నుమాయిష్‌ ఎగ్జిబిషన్​ను రాష్ట్ర గవర్నర్​ తమిళిసై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్​తో పాటు హోంమంత్రి మహమూద్‌ అలీ పాల్గొన్నారు. 45 రోజుల పాటు 81వ అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన సాగనుంది. ఈసారి ఒమిక్రాన్‌ దృష్ట్యా.. స్టాళ్ల సంఖ్యను 1600కు తగ్గించారు. ప్రదర్శనలో పలు అకాడమీలకు చెందిన పుస్తకాలతో పాటు రకరకాల వస్తువులు, రుచికరమైన ఆహార పదార్థాలు కూడా అందుబాటులో ఉండనున్నాయి. వాక్సిన్ తీసుకొని వాళ్ల కోసం నుమాయిష్​లోనూ టీకా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

వాళ్లను అనుమతించొద్దు..

నుమాయిష్​ ఎగ్జిబిషన్​కు ఎంతో చరిత్ర ఉందని గవర్నర్​ తమిళిసై తెలిపారు. ప్రదర్శనలో పాల్గొనేందుకు జమ్ముకశ్మీర్ నుంచి కూడా వ్యాపారులు రావటం నుమాయిష్​ ప్రాధాన్యతను తెలియజేస్తోందని కొనియాడారు. ఎగ్జిబిషన్​లో వాక్సిన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడాన్ని తమిళిసై అభినందించారు.

"నుమాయిష్​కు ఎంతో చరిత్ర ఉంది. ఇందులో కశ్మీర్ నుంచి కన్యకుమారి వరకు వ్యాపారులు వచ్చి వస్తువులు విక్రయిస్తారు. ఈ ప్రదర్శన కేవలం వినోదం కోసం కాకుండా.. దీని ద్వారా వచ్చే ఆదాయం విద్య కోసం ఉపయోగించడం అభినందనీయం. నుమాయిష్​లో వస్తువులు కొనుగోలు చేసి వ్యాపారాలను ప్రోత్సహించాలి. నుమాయిష్‌లో టీకా కేంద్రం ఉండటం ఎంతో సంతోషం. ప్రజలు కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ ఎగ్జిబిషన్​కు రావాలి. మాస్క్ పెట్టుకోని వాళ్లను నుమాయిష్​లోకి అనుమతించవద్దు." -తమిళిసై, గవర్నర్​

మాస్క్​ లేకుండా రావొద్దు..

"నుమాయిష్​ ప్రదర్శనలో పాల్గొనేందుకు జమ్ముకశ్మీర్ నుంచి కూడా వ్యాపారులు వచ్చారు. ఎగ్జిబిషన్‌పై వచ్చే ఆదాయం విద్య కోసం ఉపయోగిస్తారు. నుమాయిష్‌లో రుచికరమైన ఆహార పదార్థాలు కూడా ఉంటాయి. ప్రజలు మాస్క్ లేకుండా ప్రదర్శనకు రావొద్దు. నుమాయిష్‌లో టీకా కేంద్రం కూడా ఏర్పాటు చేశారు." -మహమూద్‌ అలీ, హోంమంత్రి

ఇదీ చూడండి:

Last Updated : Jan 1, 2022, 8:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.