రాష్ట్రంలో లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేసే క్రమంలో... పౌరులపై పెట్టిన కేసులు, జరిమానాలపై నివేదికను హైకోర్టుకు డీజీపీ మహేందర్‌రెడ్డి సమర్పించారు. ఏప్రిల్ 1 నుంచి జూన్ 7 వరకు 8.79 లక్షల కేసులు నమోదు చేసినట్టు డీజీపీ పేర్కొన్నారు. ఔషధాల బ్లాక్‌మార్కెట్‌పై 160 కేసులు పెట్టినట్టు తెలిపారు.
మాస్కులు ధరించని వారిపై 4.56 లక్షల కేసులు పెట్టామన్న డీజీపీ... రూ.37.94 కోట్ల జరిమానాలు వసూలు చేసినట్టు వివరించారు. భౌతికదూరం పాటించనందుకు 48,643 కేసులు... లాక్‌డౌన్, కర్ఫ్యూ ఉల్లంఘనలపై 3.43 లక్షల కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు. లాక్‌డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నాట్టు ధర్మాసనాని డీజీపీ తెలిపారు.