72వ గణతంత్ర వేడుకలను తెలంగాణ హైకోర్టులో ఘనంగా నిర్వహించారు. సీజే జస్టిస్ హిమా కోహ్లి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో హైకోర్టు న్యాయమూర్తులు, సిబ్బంది పాల్గొన్నారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా నిబంధనలు పాటిస్తూ.. పరిమిత సంఖ్యలో వేడుకలకు హాజరయ్యారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు.
2020 ఊహించని సవాళ్లను విసిరిందని జస్టిస్ హిమా కోహ్లి అన్నారు. కరోనా పరిస్థితుల్లో ప్రభుత్వ విభాగాలన్నీ స్పందించాయని తెలిపారు. హైకోర్టు కూడా కీలక భాగస్వామ్యం పోషించిందని వెల్లడించారు. కరోనా సంక్షోభ నివారణలో ముందు వరుసలో నిలిచిందని పేర్కొన్నారు.
కరోనా పరీక్షలు, చికిత్సపై హైకోర్టు చర్యలు తీసుకుందని సీజే తెలిపారు. ఆన్‌లైన్‌లో విజయవంతంగా కేసుల విచారణ చేపట్టిందని వెల్లడించారు. కొన్ని రోజుల్లో దేశంలో పరిస్థితులు పూర్వస్థితికి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
- ఇదీ చూడండి : రిపబ్లిక్ డే: గత అతిథులు వీరే.. ఈసారి మాత్రం..