ETV Bharat / city

Corona Cases In Gandhi Hospital: గాంధీ ఆస్పత్రిలో ఏడుగురు సిబ్బందికి కరోనా - గాంధీ ఆస్పత్రిలో కరోనా కేసులు

gandhi hospital
gandhi hospital
author img

By

Published : Jan 11, 2022, 7:07 PM IST

Updated : Jan 11, 2022, 8:10 PM IST

19:04 January 11

గాంధీ ఆస్పత్రిలో ఏడుగురు సిబ్బందికి కరోనా

Corona Cases In Gandhi Hospital: సికింద్రాబాద్​ గాంధీ ఆస్పత్రిలో కరోనా కలకలం రేగింది. ఆస్పత్రిలో ఏడుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్​ వచ్చిందని సూపరింటెండెంట్​ డాక్టర్​ రాజారావు తెలిపారు. గాంధీలో కొవిడ్​ కేసులు ఎక్కువగా వచ్చాయన్న ప్రచారం జరుగుతోందని చెప్పిన ఆయన.. ఆ విషయం తన దృష్టికి రాలేదని స్పష్టం చేశారు.

గాంధీలో ఆపరేషన్లు నిలిపివేత...

రాష్ట్రంలో కరోనా, ఒమిక్రాన్​ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గాంధీ ఆస్పత్రిలో అత్యవసరం కాని శస్త్రచికిత్సలు నిలిపివేస్తున్నట్లు ప్రకటన చేసింది. కొవిడ్ కేసుల పెరుగుదల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఫలితంగా ఇవాళ్టి నుంచే గాంధీలో అత్యవసరం కాని శస్త్రచికిత్సలు నిలిపివేయనున్నారు. అత్యవసర శస్త్ర చికిత్సల్లో ఎలాంటి ఆటంకం ఉండదని వెల్లడించింది.

రాష్ట్రంలో ఒమిక్రాన్​ కేసులు పెరుగుతున్న దృష్ట్యా త్వరలో గాంధీలో జీనోమ్​ సీక్వెన్సింగ్ ఏర్పాటు చేస్తామని గాంధీ ఆస్పత్రి సూపరింటిండెంట్​ డాక్టర్​ రాజారావు తెలిపారు. ఒమిక్రాన్​కు కొత్తగా చికిత్స లేదని పేర్కొన్నారు. తప్పక అందరూ కొవిడ్​ నిబంధనలు పాటించాలని కోరారు.

ఇదీచూడండి: కరోనా ఎఫెక్ట్​.. నేటి నుంచి గాంధీలో ఆ సేవలు బంద్​

Last Updated : Jan 11, 2022, 8:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.