ETV Bharat / city

Black Fungus : బ్లాక్‌ ఫంగస్‌ బాధితుల్లో.. 63% మంది మధుమేహులే! - black fungus

కొవిడ్‌ కంటే దాని పర్యవసానాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా మహమ్మారిని జయించామన్న ఆనందాన్ని బ్లాక్‌ఫంగస్‌ వ్యాధి.. ఆవిరి చేసేస్తోంది. ముక్కు, నోట్లో తలెత్తే మ్యూకర్‌మైకోసిస్‌ (బ్లాక్‌ ఫంగస్‌) మధుమేహులకు మాత్రమే పరిమితం కావడం లేదు. ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులను, రోగనిరోధకశ శక్తి తక్కువగా ఉన్నవారినీ కబళిస్తోంది.

black fungus, black fungus cases, black fungus deaths
బ్లాక్ ఫంగస్, ఏపీలో బ్లాక్ ఫంగస్ కేసులు, బ్లాక్ ఫంగస్ మరణాలు
author img

By

Published : Jun 1, 2021, 7:20 AM IST

ఏపీలో ఇప్పటివరకు 1,179 బ్లాక్‌ఫంగస్‌ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ సోమవారం వెల్లడించారు. ఇందులో పురుషులు 780 మంది, మహిళలు 399 మంది. బాధితుల్లో 743 (63.01%) మంది మధుమేహం ఉన్నవారు. 251 (21.28%) మంది రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు, 130 (11.02%) మంది ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు. కరోనా ఇన్‌ఫెక్షన్‌, మధుమేహం ఉండటం, స్టెరాయిడ్‌ల వినియోగం బ్లాక్‌ఫంగస్‌ రావడానికి ప్రధాన కారణాలవుతున్నాయి.

ఈ వ్యాధితో ఆసుపత్రుల్లో చేరిన వారి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు సేకరించినప్పుడు దాదాపు 80 శాతం మంది కొవిడ్‌ బారినపడి 3 వారాలపాటు ఆసుపత్రుల్లో చికిత్స పొందినట్లు, ఎక్కువ రోజులు ఆక్సిజన్‌పై ఉన్నట్లు తేలింది. అయితే రాష్ట్రంలో బ్లాక్‌ఫంగస్‌ బారినపడిన వారిలో ఆక్సిజన్‌ సాయంతో చికిత్స పొందినవారి కంటే పొందనివారే ఎక్కువ మంది కావడం గమనార్హం. అలాగే స్టెరాయిడ్లు వాడినవారి కంటే వాడని వారికే ఈ వ్యాధి ఎక్కువగా వస్తుండటం కొత్త కోణం.

విజయవాడలోని ఓ ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందిన 35 ఏళ్ల యువకుడు బ్లాక్‌ఫంగస్‌ బారినపడ్డాడు. అతనికి రక్తపోటు, మధుమేహం కూడా లేవు. వైరస్‌లో కొత్త స్ట్రెయిన్లు రావడం వల్ల శరీరంలోకి వైరస్‌ చేరిన వెంటనే పలువురిలో క్లోమం (పాంక్రియాస్‌)పై ప్రభావం చూపుతోంది. దీనివల్ల ఇన్సులిన్‌ ఉత్పత్తి ఎక్కువై రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతున్నాయి. అలాగే కొందరిలో ఐరన్‌ స్థాయి పెరగడం కూడా కొత్త సమస్యలను తెచ్చిపెడుతోంది. ఆక్సిజన్‌ అందించే పైపులు, మాస్కుల్లో ఫంగస్‌ చేరడం వల్ల కూడా పలువురు కొవిడ్‌ బాధితులు బ్లాక్‌ఫంగస్‌ బారినపడినట్లు భావిస్తున్నారు.

బాధితులు

ముఖంపై వాపుతో వచ్చిన కేసులే ఎక్కువ

బ్లాక్‌ ఫంగస్‌ కేసుల్లో ముఖం కుడివైపు లేదా ఎడమ వైపు వాచినవే ఎక్కువగా ఉంటున్నాయి. ఆచితూచి వాడాల్సిన స్టెరాయిడ్లను కొవిడ్‌ బాధితులు ఇష్టారాజ్యంగా వాడటం ఇందుకు ప్రధానకారణం. విజయవాడ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి (జీజీహెచ్‌)లో 86 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు ఉన్నాయి. వీరిలో ముగ్గురు కొవిడ్‌తోనూ బాధపడుతున్నారు. ముక్కులోపల నలుపు, కంటికి దెబ్బ, అంగిలి బొగ్గులా మారడం, బుగ్గల నొప్పి, పళ్లు కదలటం, తలనొప్పి వంటి లక్షణాలతో ఎక్కువ మంది బాధపడుతున్నారు. ఎండోస్కోపీ, సీటీ స్కాన్‌ ద్వారా ముక్కు, గాలి గదుల్లో ఇన్‌ఫెక్షన్‌ ఎంతవరకు విస్తరించిందో, నల్లదనం ఎక్కడుందో గుర్తిస్తున్నాం. తీవ్రత ఎక్కువ ఉంటేనే ఎమ్మారై స్కాన్‌ తీస్తున్నాం. దీనిద్వారా ఫంగస్‌ మెదడుకు, సైనస్‌కు, కంటికి విస్తరించేదేమో తెలుస్తుంది. గత శుక్రవారం నుంచి సోమవారం వరకు ఏడుగురికి శస్త్రచికిత్సలు చేశాం.

- ప్రొఫెసర్‌ రవి, ఈఎన్‌టీ విభాగాధిపతి, విజయవాడ జీజీహెచ్‌

బాధితుల సంఖ్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.