ETV Bharat / city

"అవేర్ గ్లోబల్" అరుదైన శస్త్రచికిత్స... మూత్రపిండాల్లో 55 రాళ్ల తొలగింపు

సాధార‌ణంగా మూత్రపిండాల్లో రాళ్లు అంటే ఒక‌టి లేదా రెండు ఉంటాయి. కానీ 60 ఏళ్ల వృద్ధురాలి మూత్ర‌పిండాల్లో ఏకంగా 55 రాళ్లున్నాయి. వాటిని అవేర్ గ్లోబ‌ల్ ఆసుప‌త్రి వైద్యులు అడ్వాన్స్‌డ్ ఎండోస్కొపీ, మినిమ‌ల్ ఇన్వేజివ్ స‌ర్జ‌రీ ద్వారా విజ‌య‌వంతంగా తొల‌గించారు. ఇంత పెద్ద మొత్తంలో మూత్ర‌పిండాల్లో రాళ్లు ఉండ‌టం అత్యంత అరుదైన విష‌యం. దీనివ‌ల్ల శస్త్ర‌చికిత్స‌కు ముందు ‌రోగికి భ‌రించలేనంత తీవ్ర‌మైన నొప్పి క‌లిగింది.

55 stones in 65 years old lady and aware global hospital docotrs bring out
మూత్రపిండాల్లో 55 రాళ్లు.. తీయకుంటే అంతే..!
author img

By

Published : Dec 22, 2020, 4:38 PM IST

రోగి త‌న‌కు క‌డుపులో తీవ్ర‌మైన నొప్పి ఉంద‌ని, అది ముందునుంచి వెన‌క్కి వ్యాపిస్తోంద‌ని ఆసుప‌త్రికి వ‌చ్చారు. ముఖ్యంగా మూత్ర‌విస‌ర్జ‌న స‌మ‌యంలో నొప్పి మ‌రింత ఎక్కువ ఉంటోంద‌న్నారు. దాంతోపాటు ఆ స‌మ‌యంలో వికారం, వాంతులు, త‌ల‌తిర‌గ‌డం లాంటి స‌మ‌స్య‌లూ క‌నిపించాయి. ఇవ‌న్నీ మూత్ర‌పిండాల‌కు సంబంధించిన స‌మ‌స్య ల‌క్ష‌ణాలే అనుకున్నారు. దాంతో స్థానిక‌ వైద్యులు తొలుత ఆమెకు నొప్పి త‌గ్గ‌డానికి, వాంతులు త‌గ్గ‌డానికి చికిత్స చేశారు త‌ప్ప‌, అస‌లు కార‌ణం ఏంట‌న్న‌ది ప‌రీక్షించ‌లేదు. తీరా చూస్తే... 55 రాళ్లు ఆమె ముత్రపిండాల్లో ఉన్నాయి. ఒక‌వేళ అలాగే చికిత్స చేయ‌కుండా వ‌దిలేస్తే మూత్రనాళం మూసుకుపోయే ప్ర‌మాదం కూడా ఉంది. దీనివ‌ల్ల ఇన్ఫెక్ష‌న్ల ముప్పు పెరిగి... మూత్ర‌పిండాల మీద అద‌న‌పు భారం ప‌డి, కాల‌క్ర‌మంలో అవి పూర్తిగా పాడ‌య్యే ప్ర‌మాదం ఉంది.

'రోగికి మూత్ర‌పిండాల్లో రాళ్ల వ‌ల్ల‌ తీవ్ర‌మైన నొప్పి రావ‌డంతో తీవ్ర‌మైన ఒత్తిడికి గుర‌య్యారు. రెనోగ్ర‌ఫీ, సీటీ స్కాన్ ద్వారా ప‌రిస్థితి అంచ‌నా వేసిన‌ప్పుడు ఎడ‌మ‌వైపు మూత్ర‌పిండంలో పొత్తిక‌డుపు, మూత్ర‌నాళాల మ‌ధ్య ప్రాంతంలో మ‌ధ్య‌స్థాయి నుంచి తీవ్ర‌మైన నొప్పి రావ‌డం మొద‌లైంది. దాంతో రాళ్లను తొల‌గించి, పీయూజే అడ్డంకికి చికిత్స చేయ‌డానికి ఎండోస్కొపిక్ మ‌రియు మినిమ‌ల్లీ ఇన్వేజివ్ స‌ర్జ‌రీ చేయాల‌ని మా బృందం నిర్ణ‌యించింది. మొత్తం చికిత్స‌కు రెండున్న‌ర గంట‌ల స‌మ‌యం ప‌ట్టింది. ఎలాంటి స‌మ‌స్య లేకుండా మొత్తం రాళ్ల‌న్నింటినీ బ‌య‌ట‌కు తీయ‌గ‌లిగాం'

- పి. నవీన్ కుమార్, అవేర్ గ్లోబల్ ఆసుపత్రుల సీనియర్ కన్సల్టెంట్

డాక్ట‌ర్ న‌వీన్ కుమార్‌తో పాటు యూరాల‌జీ క‌న్స‌ల్టెంటు డాక్ట‌ర్ మ‌న్నే వేణు బృందం శస్త్రచికిత్స చేశారు. అనంతరం రోగిని 48 గంట‌ల పాటు వైద్యుల ప‌రిశీల‌న‌లోనే ఉంచి, ఆసుపత్రి నుంచి ఇంటికి పంపారు. ఎప్ప‌టిక‌ప్పుడు రోగి ఆరోగ్యాన్ని ప‌రిశీలిస్తున్నారు. ప్ర‌స్తుతం అంతా సంతృప్తిక‌రంగానే ఉంది. మూత్ర‌పిండాలు మాన‌వ శ‌రీరంలో అత్యంత కీల‌క‌మైన అవ‌య‌వాలు. వాటిని బాగా చూసుకోడానికి అవేర్ గ్లోబ‌ల్ ఆసుప‌త్రి వైద్యులు కొన్ని సూచ‌న‌లు చేస్తున్నారు.

  • ప్ర‌తిరోజూ త‌గిన‌న్ని ద్ర‌వాలు తీసుకోవాలి
  • గ్యాస్‌తో కూడిన పానీయాలు తాగ‌డం మానుకోవాలి
  • పొగ‌తాగ‌డం, మ‌ద్యం తాగ‌డం అల‌వాట్లు మానేయాలి
  • ఎప్ప‌టిక‌ప్పుడు శ‌రీర బ‌రువు త‌నిఖీ చేసుకోవాలి
  • ర‌క్తంలో మ‌ధుమేహం, ర‌క్త‌పోటు స్థాయిలు స‌రిగా ఉంచుకోవాలి
  • మూత్ర‌పిండాల‌కు, మూత్ర‌నాళాల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల ల‌క్ష‌ణాలు క‌నిపించినా, కుటుంబ‌లో ఎవ‌రికైనా మూత్ర‌పిండాల స‌మ‌స్య‌లున్న చ‌రిత్ర ఉన్నా వైద్యుల‌ను సంప్ర‌దించాలి.

ఇదీ చూడండి: నెమ్మదిగా.. పద్ధతిగా.. వ్యాయామం చేయండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.