రాష్ట్రంలో మరో 41 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 31 మందికి వైరస్ సోకింది. మరో 10 మంది వలస కార్మికులు కొవిడ్ బారిన పడ్డారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,367కి చేరింది.
కరోనాతో బుధవారం ఇద్దరు మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 34కి చేరింది. మహమ్మారి బారి నుంచి కోలుకుని ఇవాళ 117 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 939 మందికి చేరింది.
394 మంది కరోనా బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో గత 14 రోజుల్లో కొవిడ్ కేసులు నమోదు కాలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.