ఏపీలోని కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం తోటచెర్ల వద్ద.. జాతీయ రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఖమ్మం జిల్లా మధిర మండలం నిదానపురం గ్రామానికి చెందిన ఇద్దరు.. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన మరో ఇద్దరు గాయపడ్డారు. వారిని 108 వాహనంలో నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒక మహిళ కూడా ఉన్నారు.
ఇవీ చదవండి. ఓఎన్జీసీలో భారీ అగ్నిప్రమాదం- ముగ్గురు గల్లంతు