ETV Bharat / city

Telangana Top News: టాప్​ న్యూస్ @3PM - 3pm topnews

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

3pm topnews
3pm topnews
author img

By

Published : Jun 28, 2022, 2:59 PM IST

  • రైతుల అకౌంట్‌లో డబ్బులు పడ్డాయ్‌..

తెలంగాణ రైతులకు శుభవార్త. ఇవాళే అన్నదాతల ఖాతాల్లోకి రైతు బంధు నగదు వచ్చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వానాకాలం సీజన్​కు సంబంధించి తొమ్మిదో విడత రైతు బందు నగదు పంపిణీని సర్కార్ ప్రారంభించింది. 68 లక్షల 94వేల మంది కర్షకుల ఖాతాల్లో 7వేల 654 కోట్ల రూపాయలు జమవుతున్నాయి.

  • అన్నను చంపించిన చెల్లెలు.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

సమాజంలో బంధాలు, బంధుత్వాలు కనుమరుగైపోతున్నాయి. ఆస్తుల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ఆఖరికి కన్నవారినైనా.. కడుపులో పుట్టిన వారినైనా కడతేర్చేందుకు వెనకాడడం లేదు. క్షణికావేశం, ఆశతో హత్యలు చేసి.. అటు ఆ కుటుంబాలను.. ఇటు వీళ్ల కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు.

  • ఇంజినీర్లపై జీహెచ్​ఎంసీ కమిషనర్ ఫైర్.. జీతం కట్

నాలాల విషయంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోని జీహెచ్​ఎంసీ ఇంజినీరింగ్ అధికారులపై కమిషనర్ లోకేశ్ ​కుమార్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలా పనులను నిర్లక్ష్యం చేసిన 38 మంది ఇంజినీర్లకు చెందిన ఒకరోజు వేతనం కోత విధిస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

  • సముద్రం మధ్యలో హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్..

ఓఎన్​జీసీ హెలికాప్టర్​ను సముద్రంలో ఎమర్జెన్సీ ల్యాండ్​ చేశారు సిబ్బంది. ఘటన జరిగిన సమయంలో అందులో పైలట్లు సహా తొమ్మిది మంది ఉన్నారు. వీరిలో ఆరుగురిని అధికారులు రక్షించారు. మిగతా వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

  • ముంచెత్తిన వరద.. చూస్తుండగానే కూలిన పోలీస్​ స్టేషన్

అసోంను వరదలు ముంచెత్తాయి. రాష్ట్రంలోని అనేక నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. నల్​బరి జిల్లాలోని రెండతస్తుల భంగ్నామరి పోలీస్ స్టేషన్​ వరదల ధాటికి పాక్షికంగా కూలిపోయింది. ముంపు ప్రభావిత ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అసోం విపత్తు నిర్వహణ అధికారులు సూచించారు.

  • భూమిలో నోట్ల కట్టలు.. ట్రాక్టర్​తో దున్నుతుంటే బయటకు..

ట్రాక్టర్​తో పొలం దున్నుతున్న ఓ వ్యక్తికి పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు కనిపించాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామస్థులు పొలంవైపు పరిగెత్తారు. క్షణాల్లో ఎవరికివారు దొరికినంత తీసుకుని పరారయ్యారు. కానీ ఆ డబ్బు చెల్లదు. ఎందుకంటే వారు తీసుకెళ్లింది రద్దు చేసిన పాత కరెన్సీని. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

  • రోహిత్‌ హెల్త్​పై 'సమైరా‌' అప్‌డేట్‌..

ఇటీవలే కొవిడ్​ బారిన పడిన టీమ్​ఇండియా కెప్టెన్​ రోహిత్​ శర్మ.. ప్రస్తుతం ఐసోలేషన్​లో ఉన్నాడు. ఈ క్రమంలో రోహిత్ కుమార్తె సమైరా శర్మ.. మద్దుముద్దు మాటలతో తనకు తెలిసిన హెల్త్​ అప్డేట్​ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మీరూ ఓ సారి చూసేయండి.

  • వ్యాపార దిగ్గజం 'పల్లోంజీ మిస్త్రీ' కన్నుమూత..

షాపూర్జీ పల్లోంజీ గ్రూప్​ ఛైర్మన్​ పల్లోంజీ మిస్త్రీ గత రాత్రి కన్నుమూశారు. ఈయనకు నలుగురు సంతానం. పారిశ్రామిక రంగానికి చేసిన సేవలకుగానూ 2016లో మిస్త్రీకి.. పద్మభూషణ్​ అవార్డు ఇచ్చింది కేంద్రం.

  • జుట్టు రాలుతోందని బాధ వద్దు! ఈ కొత్త ట్రీట్​మెంట్​తో...

జుట్టు రాలే సమస్య వయసు, ఆడామగ తేడా లేకుండా అందరిలోనూ ఇప్పుడు సాధారణమైపోయింది. దాని నివారణకు అనేక చిట్కాలు, షాంపూలు వాడుతుంటారు. ఈ సమస్యకు పరిష్కారం చూపుతూ క్లీవ్​లాండ్ క్లినిక్​ శాస్త్రవేత్తలు వినూత్నచికిత్సను రూపొందించారు. అదేంటో మీరు తెలుసుకోండి!

  • ఓటీటీ రిలీజ్​పై నిర్మాత బన్నీవాసు షాకింగ్ కామెంట్స్​

ఓటీటీలో సినిమాల విడుదలపై నిర్మాత బన్నీవాసు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓటీటీలో రిలీజ్​ చేయజం వల్ల థియేటర్ వ్యవస్థకే కాదు పెద్ద హీరోలకు తీరని నష్టమని పేర్కొన్నారు. కొత్త సినిమాలను 50రోజుల వరకు ఓటీటీలో విడుదల చేయకూడదని నిర్మాతలు భావిస్తున్నారని, దీనిపై సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.