ETV Bharat / city

gang rape: బ్లాక్​మెయిల్​ చేసి బాలికపై సామూహిక అత్యాచారం - అత్యాచారం

దేశంలో మరో దారుణమైన అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్ర ఠాణెలో ఓ మైనర్​పై 33 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

gang rape
gang rape
author img

By

Published : Sep 23, 2021, 7:15 PM IST

మహారాష్ట్ర ఠాణెలో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. దోంబివల్లిలోని భోపర్​ ప్రాంతంలో 15 ఏళ్ల బాలికపై 33 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు 23 మందిని అరెస్ట్​ చేశారు. వీరిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు. మరో 10మంది పరారీలో ఉన్నారు.

ఇదీ జరిగింది...

15 ఏళ్ల మైనర్​.. మంపాడ పోలీస్​ స్టేషన్​ పరిధిలో నివాసముంటోంది. ఆమెకు ఓ యువకుడితో సంబంధం ఉంది. ఓ సందర్భంలో మైనర్​ను ఆ యువకుడు అసభ్యకరంగా వీడియోలు తీశాడు. ఈ ఘటన జనవరి 22న జరిగింది. అనంతరం బ్లాక్​మెయిల్​కు పాల్పడ్డాడు. వీడియోలను అడ్డుపెట్టుకుని అప్పటి నుంచి 33 మంది.. దోబివల్లి, బద్లాపుర్​, ముర్బాద్​, రాబెల్​ ప్రాంతాల్లో చిత్రహింసలు పెట్టి తొమ్మిది నెలల పాటు అత్యాచారానికి ఒడిగట్టారు.

మంపాడ పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదైంది. పరారీలో ఉన్న వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు అధికారులు. నిందితులను కఠినంగా శిక్షించాలని సర్వత్రా డిమాండ్లు పెరుగుతున్నాయి.

ఇదీ చూడండి: మంచూరియా, ఫ్రైడ్ రైస్ ఆశ చూపి బాలికపై రేప్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.