కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకం ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది ఆడపడుచులకు ముఖ్యమంత్రి కేసీఆర్ దీవెనలు అందుతున్నాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఆర్థిక సాయం అందుకున్న ఆడపిల్లల తల్లిదండ్రుల కళ్లలో కనిపించే సంతృప్తే తమ పరిపాలనకు దక్కిన గొప్ప సార్థకత అని మంత్రి పేర్కొన్నారు.
ఇప్పటివరకు ఈ పథకం ద్వారా... 8 లక్షల 4 వేల 521 మందికి...రూ. 6 వేల 480 కోట్ల లబ్ధిని ప్రభుత్వం చేకూర్చినట్లు మంత్రి వివరించారు. ప్రస్తుత బడ్జెట్లో రూ.2 వేల 750 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.