తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుఠంలోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూకాంప్లెక్స్ వెలుపల 2 కిలోమీటర్ల మేర భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 26 గంటలు.. టైమ్ స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 90, 623 మంది భక్తులు దర్శించుకోగా...హుండీ ఆదాయం 2.61 కోట్లుగా ఆలయ అధికారులు వెల్లడించారు. ఇవాళ భక్తుల రద్దీకి తగినట్టుగా ఏర్పాట్లు చేశామన్నారు.
శ్రీవారి సేవలో కడియం
తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి.. స్వామివారిని దర్శించుకున్నారు. ప్రారంభ దర్శన సమయంలో స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప సభాపతి కోన రఘుపతి, మంత్రి జయరాం దర్శించుకున్నారు.
ఇదీ చదవండి