రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి తగ్గడం లేదు. కొత్తగా 2,137 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 1,71,306కు చేరింది. కొవిడ్‌తో మరో 8 మంది మృతి చెందగా... మొత్తం మృతుల సంఖ్య 1033కు పెరిగింది. వైరస్ నుంచి కోలుకుని మరో 2,192 మంది డిశ్చార్జయ్యారు.
హోం ఐసోలేషన్‌లో
ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,39,700కు చేరింది ప్రస్తుతం 30,573మంది బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. హోం ఐసోలేషన్‌లో 24,019 మంది బాధితులు ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 322 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 81.54 కరోనా రికవరీ రేటు శాతానికి చేరింది. గత 24 గంటల్లో 53,811 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
జిల్లాల వారీగా
గత 24 గంటల్లో ఆదిలాబాద్ జిల్లాలో 20, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 51, జగిత్యాల జిల్లాలో 42, జనగామ జిల్లాలో 34, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 21, గద్వాల జిల్లాలో 27, కామారెడ్డి జిల్లాలో 60, కరీంనగర్ జిల్లాలో 132, ఖమ్మం జిల్లాలో 90, ఆసిఫాబాద్ జిల్లాలో 16, మహబూబ్‌నగర్ జిల్లాలో 28, మహబూబాబాద్ జిల్లాలో 72, మంచిర్యాల జిల్లాలో 38, మెదక్ జిల్లాలో 28, మల్కాజ్ గిరి జిల్లాలో 146, ములుగు జిల్లాలో 15, నాగర్ కర్నూల్ జిల్లాలో 37, నల్గొండ జిల్లాలో 124, నారాయణ్ పేట్ జిల్లాలో 9, నిర్మల్ జిల్లాలో 24, నిజామాబాద్ జిల్లాలో 72, పెద్దపల్లి జిల్లాలో 48, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 57, రంగారెడ్డి జిల్లాలో 182, సంగారెడ్డి జిల్లాలో 65, సిద్దిపేట జిల్లాలో 109, సూర్యాపేట జిల్లాలో 61, వికారాబాద్ జిల్లాలో 29, వనపర్తి జిల్లాలో 29, వరంగల్ రూరల్ జిల్లాలో 24, వరంగల్ అర్బన్ జిల్లాలో 90, యాదాద్రి జిల్లాలో 35 చొప్పున ఉన్నాయి.
ఇదీ చూడండి : 'ఫ్రంట్‌లైన్ యోధుల కుటుంబాలకు సహాయం చేయాలి'